దేశవ్యాప్తంగా 38,408 పాఠశాలలు, 2,86,310 అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని కేంద్ర ప్రభుత్వం సోమవారం రాజ్యసభ (Rajya Sabha) కు తెలియజేసింది. ఎగువ సభలో ఎన్‌సీపీ ఎంపీ వందనా చవాన్ అడిగిన ప్రశ్నకు జల్ శక్తి సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్ సమాధానమిస్తూ, 2,85,103 పాఠశాలల్లో హ్యాండ్‌వాష్ (Hand Wash) సౌకర్యాలు లేవని చెప్పారు. అంతే కాకుండా.. 6,50,481 పాఠశాలలు చేతిపంపుల నుంచి తాగునీరు పొందుతుండగా, 61,627 పాఠశాలలు రక్షణ లేని బావుల నుంచి తాగునీరు పొందుతున్నాయని మంత్రి తెలిపారు. 82,708 పాఠశాలలకు రక్షిత బావుల ద్వారా తాగునీరు (Drinking Water) అందుతుండగా, 4,15,102 పాఠశాలలకు కుళాయి నీటి సరఫరా ఉందని ఆయన తెలిపారు. 68,374 పాఠశాలలు ప్యాకేజ్డ్ లేదా బాటిల్ డ్రింకింగ్ వాటర్‌ను సరఫరా చేస్తున్నామని.. 1,74,632 పాఠశాలలు (Schools) ఇతర మార్గాల ద్వారా తాగునీటిని పొందుతున్నాయని రాజ్యసభ వేదికగా తెలిపారు.
రాష్ట్రాల వారీగా మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలు..
అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఫంక్షనల్ టాయిలెట్లు (Toilets) లేని 2,86,310 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయని అందులో గరిష్టంగా 53,496 మహారాష్ట్రలో ఉండగా.. ఒడిశాలో 40,444 ఉన్నాయని తెలిపారు. రాజస్థాన్‌లో 29,098 అంగన్‌వాడీ కేంద్రాల్లో మరుగుదొడ్లు లేవని, అస్సాంలో 22,819 కేంద్రాల్లో అలాంటి సౌకర్యాలు లేవని పటేల్ చెప్పారు. రాష్ట్రాల వారీగా మరుగుదొడ్లు లేని అంగన్‌వాడీ కేంద్రాలు..
Nagaland killing: ఆర్మీ యూనిట్‌పై ఎఫ్‌ఐఆర్.. నాగాలాండ్ ఘటనపై కోర్టు విచారణ
పశ్చిమ బెంగాల్‌లో - 20,884
తెలంగాణ (Telangana)లో - 18,072,
ఆంధ్రప్రదేశ్ - 14,731
కర్ణాటక - 13,518
ఉత్తరప్రదేశ్ - 12,891
జార్ఖండ్ - 12,883
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల డేటా ప్రకారం 2021-22లో ఫీల్డ్ టెస్ట్ కిట్‌లను ఉపయోగించి పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నీటి నాణ్యత (Water Quality) కోసం 47,022 పరీక్షలు నిర్వహించినట్టు మంత్రి పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కింద, సురక్షితమైన నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత సౌకర్యాల కోసం గ్రామీణ భారతదేశం అంతటా అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గిరిజన రెసిడెన్షియల్ పాఠశాలల (Residential Schools) కు తాగునీటి పైపుల నీటిని అందించడానికి 2020 అక్టోబర్ 2న ప్రత్యేక ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఆయన చెప్పారు.
Squid Game: ఓటీటీలో అత్యధికమంది వీక్షించిన "స్క్విడ్ గేమ్" వెబ్‌సిరీస్ ఇప్పుడు తెలుగులో..
జల్ జీవన్ మిషన్ (జెజెఎం) ప్రారంభించిన ఆగస్టు 2019 నుంచి 5.37 కోట్ల కుటుంబాలకు కుళాయి నీటి కనెక్షన్‌లు అందించినట్లు ప్రత్యేక ప్రశ్నకు సమాధానంగా పటేల్ చెప్పారు. మిషన్ ప్రారంభానికి ముందు, 3.23 కోట్లు లేదా మొత్తం 18.93 కోట్ల కుటుంబాలలో 17 శాతం కుళాయి నీటి కనెక్షన్‌లు ఉన్నాయని, JJM కింద, సూచించిన నాణ్యతతో తగిన పరిమాణంలో తాగు నీటి కోసం ఇంటింటికీ కుళాయి నీటి కనెక్షన్ అందించబడిందని ఆయన చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Anganwadi, India, Rajya Sabha, Telangana