Exclusive: పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: న్యూస్18 ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్

మూడో సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు రాజ్‌నాథ్. హోమంత్రి పూర్తి ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకు సీఎన్ఎన్ న్యూస్ 18లో ప్రసారం అవుతుంది.

news18-telugu
Updated: March 16, 2019, 7:42 PM IST
Exclusive: పాకిస్తాన్‌తో సత్సంబంధాలను కోరుకుంటున్నాం: న్యూస్18 ఇంటర్వ్యూలో రాజ్‌నాథ్
రాజ్‌నాథ్ సింగ్
news18-telugu
Updated: March 16, 2019, 7:42 PM IST
పాకిస్తాన్‌తో తాము సంత్సంబంధాలనే కోరుకుంటున్నామని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు. న్యూస్ 18 ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన..ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపితేనే పాక్‌తో చర్చలు జరుపుతామని స్పష్టంచేశారు. ఇటు బాలాకోట్‌లో జరిగిన వైమానికదాడులపై రాజకీయాలు చేయడం తగదన్నారు హోంమంత్రి. దేశ సరిహద్దులు, రాజకీయ వ్యవస్థను కాపాడే రక్షకులని సాయుధ బలగాలపై ప్రశంసలు గుప్పించారు.

పుల్వామా ఘటన తర్వాత ఉగ్రవాద సంస్ధలకు గట్టిగా బుద్ది చెప్పాలనే ఉద్దేశంతో బాలాకో‌ట్‌లోని ఉగ్రవాదస్థావరాలపై వైమానిక దాడులు చేశాం. భారత్ దాడితో పాకిస్తాన్ నిర్ఘాంతపోయింది. అసలు దాడులే జరగలేదని బుకాయిస్తోంది. ఆధారాలను చూపాలని డిమాండ్ చేస్తోంది. వైమానిక దాడులను రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదు. ఇది జాతి ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. దీన్నిపై రాజకీయం తగదు.
రాజ్‌నాథ్ సింగ్


పాకిస్తాన్‌తో చర్చలు జరిపేందుకు మేం సిద్ధం. పొరుగుదేశంతో సత్సంబంధాలనే మేం కోరుకుంటున్నాం. కానీ ఉగ్రదాడులు, చర్చలు చేతిలో చేయి కలపలేవు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ చిత్తశుద్దితో చర్యలు తీసుకుంటేనే చర్చలు సాధ్యపడతాయి. పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాద స్థావరాలను పాకిస్తాన్ ధ్వంసం చేయాలి. ఉగ్రవాద సంస్థలకు ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకూడదు. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే పాకిస్తాన్‌తో భారత్ చర్చలు జరుపుతుంది.
రాజ్‌నాథ్ సింగ్
తాము అధికారంలోకి వచ్చాక రెండు సార్లు కాదు మూడు సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ఇటీవల ఓ బహిరంగ సభలో హోంమంత్రి వ్యాఖ్యానించారు. ఆ మూడో సర్జికల్ స్ట్రైక్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూలో పంచుకున్నారు రాజ్‌నాథ్. హోమంత్రి పూర్తి ఇంటర్వ్యూ రాత్రి 9 గంటలకు సీఎన్ఎన్ న్యూస్ 18లో ప్రసారం అవుతుంది.

Loading...
First published: March 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...