ఎయిర్‌‌ఫోర్స్ చేతికి రఫేల్ యుద్ధ విమానాలు..ముహూర్తం ఖరారు

హర్యానాలోని అంబాల ఎయిర్‌బేస్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని హాశిమారా ఎయిర్‌బేస్‌‌లో రఫేల్‌ విమానాల స్క్వాడ్రన్‌ల తరలిస్తారని తెలుస్తోంది.

news18-telugu
Updated: August 21, 2019, 11:17 PM IST
ఎయిర్‌‌ఫోర్స్ చేతికి రఫేల్ యుద్ధ విమానాలు..ముహూర్తం ఖరారు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారత వాయుసేన అమ్ముల పొదిలో అధునాతన, శక్తివంతమైన అస్త్రం చేరబోతోంది. వచ్చే నెలలో తొలి రఫేల్ యుద్ధ విమానం భారత్ చేతికి అందబోతోంది. ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్ సంస్థ రఫేల్ విమానాలను సెప్టెంబరు 20న భారత్‌కు అప్పగించనున్నారు. ఫ్రాన్స్‌లోని బోర్డెయాక్స్‌ నగరంలో ఉన్న డోసో ప్లాంట్‌లో అప్పగింత కార్యక్రమం జరగనుంది. అందుకోసం రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఎయిర్‌ఫోర్స్ చీఫ్ ఎయిర్ మార్షల్ బీఎస్ ధనోవా ఫ్రాన్స్ వెళ్లనున్నారు. వారికి డసో ఏవియేషన్ ప్రతినిధులు రఫేల్ విమానాన్ని అప్పగిస్తారని ANI వార్తా సంస్థ వెల్లడించింది.

రఫేల్ విమానాలను నడిపేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది డసో ఏవియేషన్. 24 మంది పైలట్లకు మూడు బ్యాచ్‌ల వారీగా పంపించి శిక్షణ ఇస్తారు. మొదట తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో ఒక్కో రఫేల్ విమానాన్ని మోహరిస్తారు. హర్యానాలోని అంబాల ఎయిర్‌బేస్‌తో పాటు పశ్చిమ బెంగాల్‌లోని హాశిమారా ఎయిర్‌బేస్‌‌లో రఫేల్‌ విమానాల స్క్వాడ్రన్‌ల తరలిస్తారని తెలుస్తోంది.

కాగా, 2016 సెప్టెంబరులో ఇండియా, ఫ్రాన్స్ మధ్య రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం కుదిరింది. రక్షణ అవసరాల కోసం ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ విమానాలను కొనుగోలు చేస్తున్నారు. భారత్‌కు అందే రఫేల్‌ విమానాలు ప్రస్తుతం ఫ్రాన్స్ వినియోగిస్తున్న విమానాల కన్నా ఆధునికమైనవి. భారత పరిస్థితులకు తగ్గట్లుగా మరింత ఖర్చుతో అదనపు ఫీచర్లను కూడా జోడిస్తున్నారు.First published: August 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading