రూ.4,62,00,000 ఆస్తులు, ఆయుధాలు... రాజ్‌నాథ్ నామినేషన్‌లో వివరాలు ఇవీ...

Rajnath Singh Nomination : రాజ్‌నాథ్ సింగ్ నామినేషన్ పత్రాలతోపాటూ ఇచ్చిన అఫిడవిట్‌లో కొన్ని ఆసక్తికర విషయాలున్నాయి. అవి తెలుసుకుందాం.

Krishna Kumar N | news18-telugu
Updated: April 17, 2019, 11:40 AM IST
రూ.4,62,00,000 ఆస్తులు, ఆయుధాలు... రాజ్‌నాథ్ నామినేషన్‌లో వివరాలు ఇవీ...
రాజ్ నాథ్ సింగ్ (Image : Twitter)
Krishna Kumar N | news18-telugu
Updated: April 17, 2019, 11:40 AM IST
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ ఎన్నికల సంఘం అధికారులకు తన నామినేషన్‌తోపాటూ... ఆస్తులు ఇతర వివరాలకు సంబంధించి అఫిడవిట్ ఇచ్చారు. అందులో ఆయనకూ, ఆయన భార్యకూ కలిపి... రూ.5కోట్ల 42లక్షల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. వాటిలో స్థిరాస్తులు రూ.2,97,30,580 చరాస్తులు రూ.1,64,58,260 చిత్రమేంటంటే ఆయనకు సొంతంగా కారు లేదని చెప్పారు. లక్నో పార్లమెంట్ నియోజకవర్గం నుంచీ లోక్ సభ ఎన్నికలకు పోటీ చేస్తున్న రాజ్ నాథ్... తన భార్య సావిత్రి సింగ్‌కు రూ.53 లక్షల చరాస్తులు ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేతిలో రూ.68,000 క్యాష్ ఉండగా... సావిత్రి చేతిలో రూ.37,000 నగదు ఉన్నట్లు తెలిపారు.

తన దగ్గర పాయింట్ 32 బోర్ రివాల్వర్, డబుల్ బ్యారల్ గన్ ఉన్నట్లు తెలిపారు రాజ్ నాథ్ సింగ్. అంతేకాదు... తన దగ్గర 60 గ్రాముల బంగారం ఉందన్నారు. దాని విలువ రూ.1.90లక్షలుగా చెప్పారు. అలాగే రూ.3 లక్షల విలువైన రత్నాలు కూడా ఉన్నాయన్నారు. తన భార్య దగ్గర రూ.26 లక్షల విలువైన 750 గ్రాముల బంగారం ఉందని అఫిడవిట్‌లో రాసిన రాజ్ నాథ్... రూ.25 లక్షల విలువజేసే నగలు, రూ.5.60 లక్షల విలువైన 12.5 కేజీల వెండి ఉన్నట్లు తెలిపారు.


చందౌలీ జిల్లాలోని కొన్ని గ్రామాల్లో 5 హెక్టార్ల వ్యవసాయ భూమి ఉందని, వాణిజ్య స్థలాలు లేవని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. లక్నోలోని విపుల్ ఖండ్ లో 272 చదరపు గజాల్లో ఇల్లు ఉందని, దాన్ని తాను 1997లో రూ. 3.60 లక్షలకు కొన్నట్లు వివరించారు. లక్నోలోని గోమతీ నగర్‌లో తనకు రూ.1.50 కోట్ల విలువైన ఇల్లు ఉందన్నారు ఆయన. తనపై ఏ క్రిమినల్ కేసులూ లేవనీ, 2013-14తో పోలిస్తే 2017-18 నాటికి తన ఇన్‌కం 45 శాతం పెరిగిందన్నారు రాజ్ నాథ్.

లక్నోకి రెండోసారి ప్రాతినిథ్యం వహించాలనుకుంటున్నారు రాజ్ నాథ్. ఇదివరకు ఈ స్థానానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రాతినిథ్యం వహించేవారు. మీకు తెలుసా... రాజ్ నాథ్‌ సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటారు. ఆయనకు ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్‌లో అకౌంట్లు ఉన్నాయి. సొంతంగా వెబ్ సైట్ కూడా నడుపుతున్నారు. 

ఇవి కూడా చదవండి :

పళనిస్వామి డబ్బులు పంచారా... సోషల్ మీడియాలో దుమారం... ఇదీ వాస్తవం
Loading...
15 రోజుల చిన్నారిని అంబులెన్స్‌లో తరలింపు... ఫేస్‌బుక్‌లో లైవ్ ఎందుకు ఇచ్చారు...

నన్ను సుఖపెట్టు... అవకాశాలిస్తా... టీవీ నటి రిచా భాద్రాకు వేధింపులు

నిధుల వేటలో ఏపీ ప్రభుత్వం... రోజువారీ ఖర్చులకే డబ్బుల్లేవట...

జెట్ ఎయిర్‌వేస్ మూతపడుతుందా... మరింత ముదిరిన సంక్షోభం.

First published: April 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...