• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • RAJNATH SINGH CLAIMS THERE WERE THREE CROSS BORDER STRIKES BA

రాజ్‌నాథ్ సింగ్ సంచలనం.. రెండు సార్లు కాదు, మూడు సార్లు ‘స్ట్రైక్స్’

రాజ్‌నాథ్ సింగ్ సంచలనం.. రెండు సార్లు కాదు, మూడు సార్లు ‘స్ట్రైక్స్’

రాజ్‌నాథ్ సింగ్(File)

‘గత ఐదేళ్లలో భారత సైన్యం మూడుసార్లు సరిహద్దులు దాటి దాడులు చేసింది. అయితే, రెండు సార్లుఎక్కడో నేను మీకు చెబుతా. మూడోది మాత్రం చెప్పను.’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

  • Share this:
    కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఎల్ఓసీ దాటి భారత్ రెండుసార్లు మాత్రమే దాడులు చేసిందని ప్రపంచానికి తెలుసని, అయితే, ఇండియా మూడుసార్లు స్ట్రైక్స్ చేసిందని ప్రకటించారు. కర్ణాటకలోని మంగళూర్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి ఈ కొత్త న్యూస్ చెప్పారు. 2016లో యూరీలో ఉగ్రదాడి జరిపిన తర్వాత భారత్ సర్జికల్ స్ట్రైక్ చేసింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరిలో జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి జరిగిన తర్వాత ఉగ్రవాదుల మీద ఎయిర్‌స్ట్రైక్ చేసింది. రెండుసార్లు దాడులు చేసిందని అందరూ భావిస్తున్నారు. ‘గత ఐదేళ్లలో భారత సైన్యం మూడుసార్లు సరిహద్దులు దాటి దాడులు చేసింది. అయితే, రెండు సార్లుఎక్కడో నేను మీకు చెబుతా. మూడోది మాత్రం చెప్పను.’ అని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

    రాజ్‌నాథ్ సింగ్ కామెంట్స్..



    2015 జూన్‌లో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఫర్ నాగాలాండ్‌కు చెందిన మిలిటెంట్లు భారతసైన్యం మీద దాడి చేసి 18 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్నారు. దీంతో జూన్ 10న మయన్మార్‌ భూభాగంలోకి అడుగుపెట్టిన భారత ఆర్మీ.. అక్కడ మిలిటెంట్ల క్యాంప్‌లను నాశనం చేసింది. ఈ దాడిలో 158 మంది మిలిటెంట్లు చనిపోయి ఉంటారని అంచనా వేశారు. మయన్మార్ దాడిని కూడా కలిపి చెప్పారా? అనే చర్చ జరుగుతోంది.

    బాలాకోట్‌లో భారత్ జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో సుమారు 300 మంది వరకు చనిపోయి ఉంటారని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో అక్కడ 300 సెల్‌ఫోన్లు యాక్టివ్‌గా ఉన్నాయని ఇటీవల రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు