RAJIV KUMAR FORMALLY TAKES OVER AS 25TH CHIEF ELECTION COMMISSIONER PVN
Rajiv Kumar : భారత 25వ CECగా బాధ్యతలు స్పీకరించిన రాజీవ్ కుమార్..2024 ఎన్నికలు ఈయన సారధ్యంలోనే
భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్
Rajiv Kumar takes over as CEC : భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా రాజీవ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్ లో ఆయన ఆదివారం సీఈసీగా విధుల్లో చేరారు.
Rajiv Kumar takes over as CEC : భారత 25వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)గా రాజీవ్ కుమార్ ఆదివారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయమైన నిర్వాచన్ సదన్ లో ఆయన ఆదివారం సీఈసీగా విధుల్లో చేరారు. ఇప్పటివరకు ప్రధాన ఎన్నికల కమిషనర్గా ఉన్న సుశీల్ చంద్ర శనివారమే పదవీ విరమణ చేసిన విషయం తెలిసిందే.
కేంద్ర ఎన్నికల సంఘంలోని కమిషనర్లలో సీనియర్ను ప్రధాన ఎన్నికల కమిషనర్గా నియమించడం ఆనవాయితీ. దీనిని అనుసరించి రాజీవ్ కుమార్ ను ఈ నెల 12న రాష్ట్రపతి సీఈసీగా నియమించారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన నియామకం 15వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. 2025 ఫిబ్రవరి వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. రాబోయే లోక్సభ, రాష్ట్రపతి ఎన్నికలు, ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఆయన ఆధ్వర్యంలోనే జరగనున్నాయి.
కాగా,1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్ కుమార్.. బీఎస్సీ, ఎల్ఎల్బీ, పీజీడీఎం, ఎంఏ(పబ్లిక్ పాలసీ) చేశారు. 1984 బ్యాచ్ బీహార్ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయిన రాజీవ్.. 2020 ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేశారు. 2020 సెప్టెంబర్లో ఎన్నికల కమిషనర్గా నియమితులయ్యారు. . 2020 సెప్టెంబర్ 1న ఎన్నికల కమిషనర్గా రావడానికి ముందు 'ప్రభుత్వ రంగ సంస్థల ఎంపిక మండలి' ఛైర్ పర్సన్ గా సేవలందించారు. ప్రభుత్వంలో మూడు దశాబ్దాలకు పైగా సేవలందించిన ఆయన కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖలతో కలిసి పనిచేశారు. అప్పటి ఎన్నికల కమిషనర్ అశోక్ లావాసా స్థానంలో ఈసీగా రాజీవ్ కుమార్ పనిచేశారు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.