Home /News /national /

RAJIV KUMAR APPOINTED AS NEXT CEC CHIEF ELECTION COMMISSIONER OF INDIA FROM 15 MAY AS SUSHIL CHANDRA TO RETIRE MKS

Rajiv Kumar | CEC : నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్.. 14న ప్రదీప్ చంద్ర రిటైర్

నూతన సీఈసీ రాజీవ్ కుమార్

నూతన సీఈసీ రాజీవ్ కుమార్

ప్రస్తుత సీఈసీ ప్రదీప్ చంద్ర ఈనెల 14న పదవీవిరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో భారత నూతన ప్రధాని ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీలో 2వ కమిషనర్ గా ఉండగా, ఈనెల 15న సీఈసీగా బాద్యతలు స్వీకరిస్తారు.

ఇంకా చదవండి ...
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామిక దేశమైన భారత్ లో అత్యంత కీలకమైన ఎన్నికలను నిర్వహించే రాజ్యంగ బద్ధ స్వతంత్ర వ్యవస్థ భారత ఎన్నికల సంఘం. (Election Commission of India). కేంద్ర ఎన్నికల సంఘంలోని ముగ్గురు కమిషనర్లలో సీనియరైన ఒకరు ప్రధాన ఎన్నికల కమిషనర్ గా వ్యవహరిస్తారని తెలిసిందే. ప్రస్తుత సీఈసీ ప్రదీప్ చంద్ర ఈనెల 14న పదవీవిరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో భారత నూతన ప్రధాని ఎన్నికల కమిషనర్ గా రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. రాజీవ్ కుమార్ ప్రస్తుతం ఈసీలో 2వ కమిషనర్ గా ఉండగా, ఈనెల 15న సీఈసీగా బాద్యతలు స్వీకరిస్తారు. వివరాలివే..

భారత ఎన్నికల సంఘానికి నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా (Chief Election Commissioner of India) రాజీవ్ కుమార్ నియమితులయ్యారు. దీనికి సంబంధించి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సుశీల్ చంద్ర పదవీకాలం మే 14తో ముగియనుంది. దీంతో మే 15న రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా భాద్యతలు స్వీకరించనున్నారు.

Karma : కర్మ కాటేసింది.. ప్రేయసిని చంపి.. పాతిపెడుతుండగా.. గుండెపోటుతో బొంద మీదే కుప్పకూలాడు..


కొత్త సీఈసీగా రాజీవ్ కుమార్ నియామక ఉత్తర్వులను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగానూ వెల్లడించారు. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 324లోని క్లాజ్ (2) ప్రకారం.. మే 15, 2022 నుంచి ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్‌ను నియమించడం పట్ల రాష్ట్రపతి సంతోషిస్తున్నారు. రాజీవ్ కుమార్‌కు నా శుభాకాంక్షలు’ అని కిరన్ రిజిజు పేర్కొన్నారు.

Sri Lanka Crisis: శ్రీలంకలో సైనిక తిరుగుబాటు? -రాజపక్సకు భారత్ ఆశ్రయం? -అసలేం జరుగుతోందంటే..





రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ జార్ఖండ్ కేడర్‌‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి. పబ్లిక్‌ పాలసీ, అడ్మినిస్ట్రేషన్ విభాగాల్లో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాకుండా పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ఆయన మాస్టర్స్‌ ఇన్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ సస్టెయినబిలిటీతో పాటు బీఎస్సీ, ఎల్‌ఎల్‌బీ డిగ్రీల్లో పట్టభద్రులు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఐఏఎస్‌గా పదవి వీరమణ పొందారు. 2020 సెప్టెంబర్‌లో భారత ఎన్నికల సంఘం (ECI) ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు.. రాజీవ్ కుమార్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెలక్షన్ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆయన 2020 ఫిబ్రవరిలో ఆ బాధ్యతలు చేపట్టారు.

Chicken Price: చికెన్ ధర ఆల్ టైమ్ రికార్డు.. ఏపీలో కేజీ రూ.312 -తెలంగాణలో ఇప్పటికే రూ.300గా..


కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశారు. ఆర్థిక రంగంలో విలీనాలు, కొనుగోళ్లను రూపొందించడంలో, అమలు చేయడంలో రాజీవ్ కుమార్ కీలక పాత్ర పోషించారు. దాదాపు 18 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే.. నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS)ని క్రమబద్ధీకరించడం కూడా ఆయన ఆధ్వర్యంలో జరిగింది.
Published by:Madhu Kota
First published:

Tags: Election Commission of India

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు