Ayodhya Ram Temple: అయోధ్యపై రాజీవ్, పీవీ ఓటమి.. కాంగ్రెస్ పార్టీకి ఓ పాఠం..

కమల్ నాథ్, మనీష్ తివారీ నుంచి ప్రియాంకా గాంధీ వరకు చాలా మంది కాంగ్రెస్ నేతలు రామమందిరం క్రెడిట్ రాజీవ్ గాంధీకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు.

news18-telugu
Updated: August 5, 2020, 3:27 PM IST
Ayodhya Ram Temple: అయోధ్యపై రాజీవ్, పీవీ ఓటమి.. కాంగ్రెస్ పార్టీకి ఓ పాఠం..
సోనియా, రాహుల్ గాంధీ (File)
  • Share this:
(రషీద్ కిద్వాయ్, news18.com కోసం రాసిన వ్యాసం)

జూలై 27న నేను రాసిన వ్యాసంలో అంచనా వేసినట్టు అయోధ్య విషయంలో పొరపాట్లు దిద్దుకోవడానికి కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. కమల్ నాథ్, మనీష్ తివారీ నుంచి ప్రియాంకా గాంధీ వరకు చాలా మంది కాంగ్రెస్ నేతలు రామమందిరం క్రెడిట్ రాజీవ్ గాంధీకి ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. 1986లో వివాదాస్పద ప్రదేశంలో తాళం తీయించిన దగ్గరి నుంచి 1989లో శిలాన్యాస్ నిర్వహించిన ఘనతను రాజీవ్ గాంధీ ఖాతాలో వేస్తున్నారు.

అతిపెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్... రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, సీతారాం కేసరి, సోనియాగాంధీ నేతృత్వంలో రామ మందిరం విషయంలో కొన్ని సార్లు మద్దతు పలికింది. మరికొన్నిసార్లు మౌనంగా ఉంది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా సరయు నది ఒడ్డు నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రామరాజ్యం పేరుతో తండ్రి అందుకున్న నినాదాన్ని రాహుల్ గాంధీ ఏఐసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో మరోసారి గట్టిగా వినిపించలేకపోయారు. రాజీవ్ గాంధీ, అప్పటి కేంద్ర హోంమంత్రి బూటా సింగ్ అయోధ్యలో శిలాన్యాస్ కూడా చేశారు. ఓ రకంగా 1986 - 89 మధ్యకాలంలో యూపీ ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాంగ్రెస్ నేతలు వీర్ బహదూర్ సింగ్, ఎన్డీ తివారీలాంటి వారు ‘అయోధ్య కేంద్ర బిందువైన ప్రాంతాన్ని’ స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నినంచారు. రెండుసార్లు రామాలయ నిర్మాణం కోసం రాజీవ్ ఫార్ములాతో ముందుకొచ్చారు. శిలాన్యాస్ చేయాలనే రాజీవ్ గాంధీ ప్రతిపాదన చాలా మంది నుంచి వ్యతిరేకతను తెచ్చిపెట్టింది. రాజీవ్  తూతూమంత్రంగా చేస్తున్నారని, మనస్సాక్షిగా చేయడం లేదని బీజేపీ, వీహెచ్‌పీ మండిపడ్డాయి. ఓట్ల కోసం చేస్తున్నారంటూ , లిబరల్స్, మీడియా, సోషలిస్టులు, బీజేపీయేతర వర్గాలు కూడా రాజీవ్ గాంధీ ‘హిందూ కార్డు’ను తీవ్రంగా తప్పుపట్టాయి.

పీవీ నరసింహారావు రాసిన ‘అయోధ్య’ అనే పుస్తకంలో కూడా రాజీవ్ గాంధీని పీవీ తప్పుపట్టారు. అప్పుడు రాజీవ్ తీసుకున్న చర్యల వల్లే బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిందని ఆరోపించారు. డిసెంబర్ 6, 1992న జరిగిన బాబ్రీమసీదు కూల్చివేత ఘటన తన చేయిదాటిపోయిందని చెప్పారు. సాంకేతికంగా, న్యాయపరంగా ఆ భూమి  కేంద్రం ఆధీనంలో లేదనే విషయాన్ని పీవీ స్పష్టం చేశారు. బాబ్రీమసీదు కూల్చివేసిన రోజు స్థానిక జిల్లా మెజిస్ట్రేట్ అక్కడకు కేంద్ర బలగాలను అనుమతించేందుకు నిరాకరించారని, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయాన్ని తనకు రాతపూర్వక ఆదేశాలు ఇచ్చిందని మెజిస్ట్రేట్ తెలిపినట్టు పీవీ గుర్తు చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తాను చేసింది కరెక్టే అని చెప్పుకోవడానికి తాను అయోధ్య పుస్తకం రాయలేదని పీవీ నరసింహారావు చెప్పారు. వాస్తవంగా అప్పుడు ఏం జరిగిందని ప్రపంచానికి చెప్పడం కోసమే తాను పుస్తకం రాశానన్నారు.

అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూపీలో రాష్ట్రపతి పాలన విధించవచ్చుకదా అని కొందరు ప్రశ్నించారని, అప్పుడు తన కేబినెట్ మంత్రుల్లో ఒక్కరు కూడా ఆ ప్రతిపాదన తేలేదన్నారు. ఒక ప్రత్యేక పరిస్థితిని బట్టి ఎలా రాష్ట్రపతి పాలన విధిస్తామని ప్రశ్నించారు. అలాంటిది అంతకు ముందు ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక్కడ పీవీ స్పష్టంగా ఏం చెప్పారంటే మసీదు కూల్చివేతకు అప్పటి యూపీలో కళ్యాన్ సింగ్ ప్రభుత్వం, బీజేపీనే కారణం అని తేల్చారు. అలాగే, ఆ రోజు జరిగిన ఘటనకు నన్ను బాద్యుడిని చేయడానికి చాలా మంది సిద్ధమైపోయారు. నన్ను కొట్టడానికి వాళ్లకి మసీదు రూపంలో ఓ కర్ర దొరికింది అని పీవీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిస్ప్యూట్ అనే చాప్టర్‌లో పీవీ ఓ ప్రస్తావన చేశారు. మసీదు కూలక ముందే కొందరు కాంగ్రెస్ నేతలు కీలక లెక్కలు వేసేశారని చెప్పారు. ఒకవేళ వారు సక్సెస్ అయితే (వీహెచ్‌పీ, బీజేపీ తో చర్చలు జరిపి ఆపగలిగితే) , వారితో చర్చలు జరిపిన క్రెడిట్ దక్కించుకుందామనుకున్నారు. ఒకవేళ ఘటన జరిగిపోయినా.. ఆ తప్పు నా మీద రుద్దడానికి కూడా ప్రిపేర్ అయ్యారని తన కేబినెట్ మంత్రుల గురించి పీవీ ప్రస్తావించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 5, 2020, 3:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading