మాజీ ప్రధాని ధివంగత రాజీవ్ గాంధీ(Rajiv Gandhi) 76వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆయనకు నివాళులర్పించారు. రాజీవ్ గాంధీ దూరదృష్టి కలిగిన దార్శనిక నాయకుడిగా అభివర్ణించారు. అంతకంటే మించి సాటివారిపై ఎంతో ప్రేమ, అభిమానాన్ని కనబరిచే మానవత్వం కలిగిన వ్యక్తిగా పేర్కొన్నారు. ఆయన్ను తండ్రిగా పొందడం తన అదృష్టమని...తనకెంతో గర్వకారణమని పేర్కొన్నారు.ఈ రోజు..ప్రతి రోజూ ఆయన్ను మిస్ అవుతూనే ఉంటామంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.
అటు ప్రధాని నరేంద్ర మోదీ సైతం రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ట్విట్టర్లో ఆయనకు నివాళులర్పించారు.
రాజీవ్ గాంధీ అరుదైన ఫోటోలు...ఇక్కడ చూడండి
దేశంలో అత్యంత పిన్న వయస్సులో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వ్యక్తి రాజీవ్ గాంధీ. 1984లో ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో రాజీవ్ గాంధీ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటికి రాజీవ్ గాంధీ వయస్సు కేవలం 40 సంవత్సరాలు మాత్రమే.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ (Image:Getty)
1944 ఆగస్టు 20న జన్మించిన రాజీవ్ గాంధీ...1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్టీటీఈకి చెందిన మానవ బాంబు దాడిలో మృతి చెందారు. ఆయన వర్థంతిని ప్రతి సంవత్సరం ఉగ్రవాద నిరోధక రోజుగా జరుపుకుంటున్నారు.