• HOME
 • »
 • NEWS
 • »
 • NATIONAL
 • »
 • RAJIV GANDHI ASSASSINATION CONVICT NALINI SUICIDE ATTEMPT IN VELLORE JAIL AK

జైలులో రాజీవ్‌ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

జైలులో రాజీవ్‌ గాంధీ హంతకురాలు నళిని ఆత్మహత్యాయత్నం

నళిని శ్రీహరన్

ప్రస్తుతం తమిళనాడులోని వేలురు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని... మంగళవారం ఉదయం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు ఆమె లాయర్ తెలిపారు.

 • Share this:
  మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ హత్య కేసులో నిందితురాలు నళిని ఆత్మహత్యాయత్నం చేశారు. ప్రస్తుతం తమిళనాడులోని వేలురు జైలులో శిక్ష అనుభవిస్తున్న నళిని... మంగళవారం ఉదయం ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు ఆమె లాయర్ తెలిపారు. విషయం గమనించిన జైలు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె ఎందుకు ఈ రకమైన చర్యకు పాల్పడింది ఇంకా తెలియరాలేదు. రాజీవ్‌ హత్య కేసులో దోషిగా తేలిన నళిని 29 ఏళ్లుగా జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. బెయిల్‌ కోసం గతకొంత కాలంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న నళిని... తన కుమార్తె హరిత వివాహానికి ఆరు నెలలు పాటు పెరోల్‌పై విడుదలైన తిరిగి జైలుకు వెళ్లారు.

  రాజీవ్‌ హత్యకేసులో నళినితో పాటు ఆమె భర్త మురుగన్‌ సహా ఏడుగురు వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. గత 29 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్న నళిని, సుదీర్ఘకాలం జైలు జీవితం గడిపిన మహిళగా కూడా గుర్తింపు పొందారు. 1991, మే నెలలో ఎన్నికల ప్రచారం నిమిత్తం విశాఖ నుంచి తమిళనాడులోని శ్రీ పెరుంబుదూర్‌కి వెళ్లిన రాజీవ్‌ గాంధీని ఎల్‌టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యులు బాంబు పేల్చి హతమార్చారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్టు చేయగా, అందులో నళిని కూడా ఉన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published:

  అగ్ర కథనాలు