రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి పెరోల్.. కూతురి పెళ్లి కోసం 30 రోజుల పాటు..

తన కూతురి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలని నలిని శ్రీహరణ్‌ కోరగా మద్రాస్ హైకోర్టు 30 రోజుల పాటు మంజూరు చేసింది. దీంతో ఈ రోజు ఉదయం ఆమె వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: July 25, 2019, 12:01 PM IST
రాజీవ్ గాంధీ హంతకురాలు నళినికి పెరోల్.. కూతురి పెళ్లి కోసం 30 రోజుల పాటు..
నలిని శ్రీహరణ్ (photo: ANI)
  • Share this:
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషిగా తేలిన నళిని శ్రీహరణ్‌కు జీవిత ఖైదు పడిన విషయం తెలిసిందే. అయితే, ఆమె తన కూతురి పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలని కోరగా మద్రాస్ హైకోర్టు 30 రోజుల పాటు మంజూరు చేసింది. దీంతో ఈ రోజు ఉదయం ఆమె వెల్లూరు జైలు నుంచి విడుదలయ్యింది. వాస్తవానికి, కూతురి పెళ్లి కోసం ఆరు నెలల పాటు పెరోల్ మంజూరు చేయాలని ఈ నెల 5న నలిని హైకోర్టును కోరింది. కోర్టు మాత్రం 30 రోజులకే పరిమితం చేసింది. నలిని కూతురు వెల్లూరు జైల్లోనే జన్మించింది. యూకేలో పెరిగి, అక్కడే విద్యనభ్యసించింది. ప్రస్తుతం వైద్య వృత్తిలో కొనసాగుతోంది.

కాగా, 2016లో తొలిసారిగా నళిని పెరోల్‌పై విడుదలైంది. తన తండ్రి అంత్యక్రియల కోసం 12 గంటల పాటు ఆమెకు పెరోల్ మంజూరు చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో 1991లో అరెస్టైన ఆమె.. 28 ఏళ్లుగా జైలు జీవితాన్ని గడుపుతోంది. తొలుత ఉరిశిక్ష విధించినా.. దాన్ని జీవిత ఖైదుగా మార్చారు.

First published: July 25, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు