RAJIV GANDHI ASSASSINATION CASE UPDATES SUPREME COURT ORDERS TO RELEASE CONVICT AG PERARIVALAN AFTER 31 YEARS MKS
Rajiv Gandhi | AG Perarivalan : రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషి విడుదల.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రాజీవ్ హత్య కేసు దోషి పెరరివలన్
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీవ్ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరరివలన్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వివరాలివే..
భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసుకు (Rajiv Gandhi Assassination Case) సంబంధించి తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. రాజీవ్ హత్య కేసులో దోషి అయిన ఏజీ పెరరివలన్ విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లంటూ దోషి పెరరివలన్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బిఆర్ గవాయ్, ఎఎస్ బోపన్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. రాజీవ్ గాంధీని హత్య చేసిన కేసులో నిందితుడిగా తన 19వ ఏట జైలుకు వెళ్లిన పెరరివలన్ గత 31 ఏళ్లుగా శిక్ష అనుభవిస్తున్నాడు. ఎట్టకేలకు అతని విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశించింది..
రాజీవ్ హంతకులకు క్షమాభిక్ష విషయంలో సోనియా గాంధీ కుటుంబం తొలి నుంచీ సానుకూలంగా ఉండటం తెలిసిందే. దోషుల విడుదలకు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అభ్యర్థలను చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు క్యాబినెట్ అంగీకరించిందని, ఇక ఆర్టికల్ 142 ప్రకారం పేరరివాళన్‌ను విడుదల చేయడం సమంజసమే అని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. తనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేయాలంటూ రాజీవ్ హత్య కేసు దోషి పెరరివలన్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం విచారించి ఈ మేరకు తీర్పు చెప్పింది.
రాజ్యాంగంలోని 142వ అధికరణం ప్రకారంమే పెరరివలన్ విడుదలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్టు ధర్మాసనం పేర్కొంది. కాగా, పేరారివాలన్ క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతికి పంపాలని గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి రాజ్యాంగపరమైన మద్దతు లేదని ఈ సందర్బంగా సుప్రీంకోర్టు పేర్కొనడం గమనార్హం. రాజీవ్ హంతకుల విడుదలకు సోనియా గాంధీ కుటుంబం మొదటి నుంచీ సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే.
రాజీవ్ గాంధీ హత్య కేసుకు సంబంధించి 1991 జూన్ 11న చెన్నైలో ఏజీ పెరరివలన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజీవ్ హత్యకు వాడిన పేలుడు పరికరాలు అందించిన కేసులో అతడికి జైలు శిక్ష పడింది. అనంతరం 1999లో మరణశిక్ష విధించినప్పటికీ అది రద్దైంది. చివరిగా 2014లో ఆ శిక్ష జీవితఖైదుగా విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌లో రాజీవ్‌గాంధీ హత్య జరిగింది. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. అందులో పెరరివలన్ ఒకడు. కాగా, పెరరివలన్ విడుదలతో మరో ఆరుగురు నిందితుల విడుదలకు మార్గం సుగమం అయ్యే అవకాశాలున్నాయి,
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.