మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితురాలు, 27 ఏళ్లుగా జైల్లో ఉన్న నళిని శ్రీహరన్కు పెరోల్ లభించింది. నళినికి 30 రోజుల పాటు పెరోల్ ఇస్తూ మద్రాస్ హైకోర్టు జూలై 5న ఆదేశాలు ఇచ్చింది. రాజీవ్ గాంధీ హత్యకేసుకు సంబంధించి ఏడుగురు ప్రధాన నిందితుల్లో నళిని శ్రీహరన్ కూడా ఒకరు. తన కుమార్తె పెళ్లి కోసం తనను ఆరు నెలల పాటు జైలు నుంచి విడుదల చేయాలని కోరుతూ గత ఏప్రిల్లో ఆమె మద్రాస్ హైకోర్టుకు దరఖాస్తు చేసుకున్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఆమెకు నెల రోజుల పాటు పెరోల్ ఇచ్చింది. 1991 మే 21న తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న రాజీవ్ గాంధీని సూసైడ్ బాంబ్తో హత్య చేశారు. ఆ కేసులో నళిని శ్రీహరన్తో పాటు మరో ఆరుగురు దోషులుగా శిక్షను అనుభవిస్తున్నారు.