రెండో పెళ్లి నిజమే...ధృవీకరించిన రజనీకాంత్ కుమార్తె

తాను రెండే పెళ్లి చేసుకోనున్నట్లు స్వయంగా సౌందర్య రజనీకాంత్ ధృవీకరించారు. మరో వారం రోజుల్లో నటుడు, వాణిజ్యవేత్త వనంగాముడి విశాగణ్‌‌ను పెళ్లి చేసుకోనున్నట్లు సౌందర్య ట్విట్టర్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 11న వారి వివాహ వేడుక చెన్నైలో జరగనుంది.

news18-telugu
Updated: February 4, 2019, 3:56 PM IST
రెండో పెళ్లి నిజమే...ధృవీకరించిన రజనీకాంత్ కుమార్తె
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య
news18-telugu
Updated: February 4, 2019, 3:56 PM IST
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నారు. దర్శక, నిర్మాత అయిన సౌందర్య రెండో పెళ్లి చేసుకోనున్నట్లు గత కొన్ని మాసాలుగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు తెరదించుతూ..తన పెళ్లి వార్తలను స్వయంగా సౌందర్య సోమవారం ధృవీకరించారు. మరో వారం రోజుల్లో నటుడు, వాణిజ్యవేత్త వనంగాముడి విశాగణ్‌‌ను పెళ్లి చేసుకోనున్నట్లు సౌందర్య ట్విట్టర్‌లో వెల్లడించారు. పెళ్లి కూతురు వస్త్రధారణలో ఉన్న తన ఫోటోను కూడా ట్వీట్ చేశారు. చెన్నైలో వారిద్దరి వివాహం ఫిబ్రవరి 11న జరగనుంది. రెండ్రోజుల పాటు సాగనున్న పెళ్లి వేడుకలు ఫిబ్రవరి 9న మొదలవుతాయి.

డీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్‌ముడి సోదరుడైన పారిశ్రామికవేత్త వనంగాముడి తనయుడు విశ్వగణ్. ఇటీవల విడుదలైన ‘వంజగర్ వులగం’ అనే సినిమాలో విశ్వగణ్ కీలక పాత్రలో కనిపించాడు. విశ్వగణ్ అమెరికాలో ఎంబీఏ పూర్తి చేసాడు.

2010లో అశ్విన్ అనే బిజినెస్‌మేన్‌తో సౌందర్య వివాహం జరిగింది. వీరికి వేద కృష్ణ (6) అనే కుమారుడు వున్నాడు. కానీ అశ్విన్‌తో ఏర్పడిన మనస్పర్థల కారణంగా సౌందర్య 2016లో విడాకులు తీసుకుంది. గత రెండేళ్లుగా సౌందర్య తన కుమారుడితో పాటు పుట్టింట్లోనే ఉంటోంది.
First published: February 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...