Home /News /national /

RAJINIKANTH PRAYS FOR THE SAFE RETURN OF SUJITH WHO IS STUCK IN BOREWELL SK

బోరు బావిలోనే చిన్నారి సుర్జిత్.. రజినీకాంత్ ప్రార్థనలు

సుర్జిత్, రజినీకాంత్

సుర్జిత్, రజినీకాంత్

SDRF, NDRF పర్యవేక్షణలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐతే దీనిపై స్పందించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

    రెండు రోజులవుతోంది. బోరు బావిలో పడిన చిన్నారి ఇంకా బయటకు రాలేదు. ఆ బాలుడిని కాపాడేందుకు రెస్క్యూ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నడుకుట్టుపట్టిలోని ఓ బోర్ వెల్‌లో రెండేళ్ల సుర్జిత్ ఆడుకుంటూ వెళ్లి పడిపోయాడు. శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 600 అడుగుల లోతులో పడిపోయిన బాలుడు మొదట 35 అడుగుల లోతులో చిక్కుకున్నాడు. ఐతే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న క్రమంలో శనివారం రాత్రి 90 అడుగుల లోతుకు పడిపోయాడు సుర్జిత్.

    బోరు బావిలో ఉన్న చిన్నారిని నిరంతరాయంగా ఆక్సీజన్‌ను అందజేస్తున్నారు. ఐఐటీ మద్రాస్‌కు చెందిన నిపుణులతో మరో ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. SDRF, NDRF పర్యవేక్షణలో ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఐతే దీనిపై స్పందించిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఆ బాలుడు క్షేమంగా బయటకు రావాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. సుర్జిత్ బయటకు తీసుకొచ్చేందుకు యంత్రాలతో ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఈ క్రమంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు.

    First published:

    Tags: Borewell, Rajinikanth, Tamilnadu

    తదుపరి వార్తలు