హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

రాజకీయాలపై రజినీకాంత్ సంచలన నిర్ణయం... ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా ప్రకటన

రాజకీయాలపై రజినీకాంత్ సంచలన నిర్ణయం... ఈసారి మరింత పవర్‌ఫుల్‌గా ప్రకటన

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని లెక్కల ప్రకారం చూస్తే మాత్రం 2021 వరకు రజినీకాంత్ ఆస్తులు దాదాపు 380 కోట్లు. అందులో సినిమాల నుంచి ఆయనకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఒక్కో సినిమాకు యావరేజ్‌గా 60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటాడు రజినీకాంత్. ఈయన ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చేయడు. కేవలం సినిమాల నుంచి మాత్రమే సంపాదిస్తాడు. అందులోనే కొన్ని సేవల కోసం ఖర్చు చేస్తాడు.

సోషల్ మీడియాలో వచ్చే కొన్ని లెక్కల ప్రకారం చూస్తే మాత్రం 2021 వరకు రజినీకాంత్ ఆస్తులు దాదాపు 380 కోట్లు. అందులో సినిమాల నుంచి ఆయనకు ఎక్కువగా ఆదాయం వస్తుంది. ముఖ్యంగా ఒక్కో సినిమాకు యావరేజ్‌గా 60 కోట్ల వరకు పారితోషికం అందుకుంటాడు రజినీకాంత్. ఈయన ఎలాంటి కమర్షియల్ యాడ్స్ చేయడు. కేవలం సినిమాల నుంచి మాత్రమే సంపాదిస్తాడు. అందులోనే కొన్ని సేవల కోసం ఖర్చు చేస్తాడు.

Rajinikanth: రజనీకాంత్... అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఓవైపు సినిమాల సంగతి చూసుకుంటూనే... మరోవైపు అభిమానులకు ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ ఇస్తున్నారు. తాజాగా మరో ప్రకటన చేశారు.

Rajinikanth: ఆ మధ్య అనారోగ్యంతో ఆస్పత్రిపాలై... కుటుంబ సభ్యుల సూచనతో... రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పిన సూపర్ స్టార్ రజనీకాంత్... మళ్లీ రాజకీయాల్లోకి వస్తారని అభిమానులు ఎదురుచూస్తుంటే... మరోసారి సంచలన ప్రకటన చేశారు. తాను స్థాపించిన రాజకీయ పార్టీ రజనీ మక్కల్ మంద్రంను మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో... రేపో, మాపో తలైవా మళ్లీ వస్తారని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇకపై మక్కల్ మంద్రం... ఓ సాధారణ స్వచ్ఛంద సంస్థలా పనిచేస్తుంది. ఇది ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుంది అని రజనీకాంత్ సోమవారం ప్రకటించారు. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాకపోతే... ఆయన పార్టీ ఫ్యూచరేంటి అనుకుంటున్న వారికి తాజా నిర్ణయంతో ఆన్సర్ దొరికినట్లైంది.

"రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రావాలి అనుకున్నాను. కానీ అందుకు సరైన సమయం కుదరలేదు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదు. అందువల్ల నేను విన్నవించుకుంటున్నాను. ఇకపై రజనీ మక్కల్ మంద్రం... అభిమానుల చారిటీ ఫోరమ్‌లా పనిచేస్తుంది. ఇది ప్రజలకు మేలు చేస్తుంది" అని రజనీకాంత్ తన స్టేట్‌మెంట్‌లో తెలిపారు. ప్రస్తుతానికి ఈ సంస్థలోని సెక్రెటరీలు, అసోసియేట్లు, డిప్యూటీ సెక్రెటరీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు... అందరూ పనిచేస్తూనే ఉంటారని రజనీ తెలిపారు.

ఇది కూడా చదవండి: Business Idea: తేలికైన వ్యవసాయం... తక్కువ పెట్టుబడితో లక్షలు సంపాదిస్తున్న రైతులు

Rajinikanth
పార్టీ సమావేశంలో రజనీకాంత్

Rajinikanth
పార్టీ సమావేశంలో రజనీకాంత్

తాజా ప్రకటనతో ఇక రజనీకాంత్ ఎప్పటికీ రాజకీయాల్లోకి రారని స్పష్టమైపోయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈమధ్యే జరిగాయి. పదేళ్ల తర్వాత మళ్లీ అధికారంలోకి వచ్చిన DMK పార్టీపై ఇప్పట్లో ప్రజా వ్యతిరేకత అంతగా రాదనే అనుకోవచ్చు. అందువల్ల రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినా... మరో నాలుగేళ్లపాటూ బలమైన ప్రతిపక్షంగా కొనసాగాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎన్నికలు జరిగినా... వాటిలో ఎంతవరకూ విజయం సాధిస్తారన్నది సస్పెన్సే. దానికి తోడు అనారోగ్య సమస్యలు తలైవాను ఇబ్బంది పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ రాజకీయాలవైపు చూసే కంటే... సినిమాలు చేస్తూ... అభిమానులతో టచ్‌లో ఉంటూ... సేవా కార్యక్రమాలు కొనసాగించాలని రజనీ భావిస్తున్నట్లు తెలిసింది.

First published:

Tags: Rajni kanth, Rajnikanth

ఉత్తమ కథలు