వదలొద్దు...ఆ పోలీసులను కఠినంగా శిక్షించాల్సిందే: రజనీకాంత్

తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలపై అరెస్టైన తండ్రి జయరాజ్, తనయుడు బెనిక్స్..జైల్లో మృతి చెందడం సంచలనం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌లో వారిని పోలీసులు తీవ్రంగా కొట్టినందునే చనిపోయారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

news18-telugu
Updated: July 1, 2020, 1:41 PM IST
వదలొద్దు...ఆ పోలీసులను కఠినంగా శిక్షించాల్సిందే: రజనీకాంత్
రజనీకాంత్(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశ వ్యాప్తంగా దుమారం రేపుతున్న తమిళనాడులోని ట్యూటికోరిన్ జిల్లాలో జరిగిన తండ్రి, తనయుల లాకప్ డెత్ ఘటనపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఎట్టకేలకు మౌనం వీడారు. తండ్రి, తనయుడి మరణాలకు కారణమైన వారిని వదలొద్దని...కఠినంగా శిక్షించాల్సిందేనంటూ ట్వీట్ చేశారు. తండ్రి, తనయుడిని పోలీసులు చిత్రహింసలకు గురిచేసి అమానుషంగా చంపడాన్ని మానవజాతి ఖండిస్తోందన్నారు. ఆ తర్వాత కూడా పోలీసులు మేజిస్ట్రేట్ ఎదుట కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు, మాట్లాడిన తీరు గర్హనీయమన్నారు. మేజిస్ట్రేట్ ఎదుట పోలీసుల తీరు గురించి తెలుసుకుని తాను షాక్ కు గురైనట్లు తెలిపారు. బాధ్యులైన వారందరికీ తగిన శిక్ష పడాల్సిందేనన్నారు. వారిని ఎట్టి పరిస్థితిలోనూ వదలద్దంటూ రజనీకాంత్ ట్వీట్ చేశారు.ట్యూటికోరిన్ జిల్లాలోని సత్తాన్‌కుళంలో జయరాజ్(59), ఆయన తనయుడు బెనిక్స్(31) మొబైల్ ఫోన్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 19న లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి షాప్‌ను తెరిచి ఉంచారన్న కారణంగా స్థానిక పోలీసులకు, వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. వీరిద్దరిని అరెస్టు చేసిన పోలీసులు...రిమాండ్‌పై జైలుకు పంపారు. ఆ తర్వాత కోవిల్‌పట్టి ఆస్పత్రిలో తండ్రి, తనయులు ఇద్దరూ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. బెనిక్స్ 21న కోవిల్‌పట్టి ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించగా...మరుసటి రోజు 22న ఉదయం ఆయన తండ్రి జయరాజ్ మృతి చెందారు. వారిద్దరూ గుండెపోటుతో మృతి చెందినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీస్ స్టేషన్‌లో వీరిద్దరిని పోలీసులు లాఠీలతో అమానుషంగా కొట్టినందున తీవ్ర రక్తస్రావమై వారు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తండ్రి, తనయులు ఇద్దరినీ పోలీసులే చంపేశారని ఆరోపిస్తున్నారు. బాధ్యుతలైన పోలీసులపై హత్యానేరం కింద కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వారి వాదనకు బలం చేకూర్చేలా అదే పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ రేవతి..ఆ రోజు రాత్రంతా పోలీసులు తండ్రి, తనయులను కొట్టినట్లు మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపారు.

jayaraj and fenix, jayaraj and fenix news, jayaraj and fenix death, jayaraj and bennix, jayaraj and bennicks case, tamilnadu lockup death case, tamilnadu father son death case, జయరాజ్ బెనిక్స్ కేసు, జయరాజ్ ఫెనిక్స్ మృతి, లాకప్ డెత్ కేసు, తమిళనాడు
పోలీసులు తీవ్రంగా కొట్టడంతో మరణించిన జయరాజ్, ఆయన తనయుడు బెనిక్స్(ఫైల్ ఫోటో)
తండ్రి తనయుడు లాకప్ డెత్ వ్యవహారంపై అటు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికాలో పెను దుమారంరేపుతున్న జార్జి ఫ్లాయిడ్ హత్యోదంతంతో ఈ ఘటనను పోల్చుతున్నారు. ఈ నేపథ్యంలో తండ్రి తనయులు జయరాజ్, బెనిక్స్ లాకప్ డెత్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి బదిలీచేస్తూ పళనిస్వామి సర్కారు తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టు ఆమోదం తెలిపింది.

చైనా యాప్స్‌ను బ్యాన్ చేయడాన్ని మీరు సమర్థిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? న్యూస్18 ఒపీనియన్ పోల్‌లో పాల్గొనండి.
First published: July 1, 2020, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading