RAJASTHAN SMUGGLERS GET HEROIN FROM PAKISTAN THROUGH DRONE IN SRIGANGANAGAR SECURITY AGENCIES CAUGHT 5 PEOPLE SK
పాకిస్తాన్ నుంచి ఇండియాకు డ్రగ్స్.. వారికి ప్రతిరోజూ ఇదే పని.. స్మగ్లింగ్ ఇంత ఈజీనా?
ప్రతీకాత్మక చిత్రం
Drugs Smuggling From Pakistan: పాకిస్తాన్ నుంచి భారత్‌కు హెరాయిన్ (Heroin) స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ అందుకొని.. అక్కడి నుంచి పంజాబ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు
మనదేశంలో డ్రగ్స్ వాడకం ఇటీవల బాగా పెరిగింది. ముఖ్యంగా పాకిస్తాన్ నుంచి భారత్‌కు అక్రమార్గంలో మాదకద్రవ్యాలు (Drugs Smuggling) వస్తున్నాయి. చాలా రోజులుగా ఇది జరుగుతోంది. డ్రోన్ల ద్వారా పంజాబ్ సరిహద్దు దాటించి.. అక్కడి నుంచి తమ మనుషుల ద్వారా ఇతర ప్రాంతాలకు చేరవేసేవారు స్మగ్లర్ము. కానీ పంజాబ్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెండడి బీఎస్ఎఫ్, పంజాబ్ పోలీసులు నిఘా పెట్టడంతో మాదకద్రవ్యాల ముఠా రూటుమార్చేసింది. ఇప్పుడు రాజస్థాన్ సరిహద్దు నుంచి దేశంలోకి డ్రగ్స్‌ని తీసుకొస్తున్నారు. భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దు(India Pakistan International Border)లోని శ్రీగంగానగర్ జిల్లాలో బీఎస్ఎఫ్ (BSF), పోలీసులు (Rajasthan Police), ఇంటెలిజెన్స్ వర్గాలు సంయుక్తంగా డ్రగ్స్ ముఠా గుట్టును రట్టు చేశాయి. పాకిస్తాన్ నుంచి భారత్‌కు హెరాయిన్ (Heroin) స్మగ్లింగ్ చేస్తున్న ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరు డ్రోన్ల ద్వారా పాకిస్తాన్ నుంచి డ్రగ్స్ అందుకొని.. అక్కడి నుంచి పంజాబ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు
ఇలా దొరికారు...
పంజాబ్‌లోని ఫిర్దోస్‌పూర్‌లో ఇటీవల హెరాయిన్ పట్టుకున్నారు. స్మగ్లర్లను అరెస్ట్ చేసి విచారిస్తే.. వారితో రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌కు ఉన్న లింకులు బయటపడ్డాయి. డ్రగ్స్ పాకిస్తాన్ నుంచి రాజస్థాన్‌కు డ్రోన్లలో వస్తాయని.. అక్కడి నుంచి తమ మనుషుల ద్వారా పంజాబ్‌కు తీసుకొస్తున్నామని నిందితులు చెప్పారు. వారు ఇచ్చిన సమాచారంతో రాజస్థాన్ పోలీసులు, బీఎస్ఎఫ్ అప్రమత్తమయింది. పక్కా సమాచారంతో శ్రీగంగానగర్ జిల్లా 6 MSR గ్రామంలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం గుర్నామ్ సింగ్ , అతని ఇద్దరు కుమారులు మంగ, రవిలను అరెస్ట్ చేశారు. బింజోర్ ప్రాంతంలో భూపేంద్ర సింగ్, జస్వీర్ సింగ్ అనే మరో ఇద్దరు సోదరులను కూడా పట్టుకున్నారు. ఈ ఐదుగురు నిందితులకు పాకిస్తాన్ డ్రగ్స్ ముఠాతో సంబంధాలున్నాయని.. అక్కడి నుంచి డ్రోన్ల ద్వారా డ్రగ్స్ తెప్పించి.. అనంతరం పంజాబ్‌కు చేరవేస్తున్నారని పోలీసులు వెల్లడించారు. మాదకద్రవ్యాలను పంజాబ్‌కు డెలివరీ ఇవ్వడానికి భారీగానే డబ్బులును వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
డ్రోన్లపై నిఘా..
ఇటీవల ఇండియా-పాకిస్తాన్ అంర్జాతీయ సరిహద్దు వెండడి డ్రోన్ల కదలికలు పెరిగాయి. మార్చి 4, 5 రాత్రి వేళ పాక్ డ్రోన్‌ల కదలిక కనిపించింది. వెంటనే బీఎస్ఎఫ్ సిబ్బంది అప్రమత్తమై.. డ్రోన్‌పై కాల్పులు జరిపి వెనక్కి తరిమారు. అప్పటి నుంచి సరిహద్దు భద్రతా దళంతో పాటు ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా అంతర్జాతీయ సరిహద్దుపై నిఘాపెట్టారు. గతంలో పాకిస్తాన్ నుంచి పంజాబ్‌కు హెరాయిన్ సరఫరా అయ్యేది. చాలా కేసులు తెరపైకి రావడంతో పంజాబ్, పాకిస్తాన్ సరిహద్దులో భద్రత పెంచారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ స్మగ్లర్ల కళ్లు శ్రీగంగానగర్ జిల్లాలోని అనుప్‌గఢ్, శ్రీకరణ్‌పూర్ సెక్టార్‌లో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతంపై పడ్డాయి. అక్కడి వరకు డ్రోన్లలో డ్రగ్స్ పంపించి.. అనంతరం రాజస్థాన్ నుంచి పంజాబ్‌కు చేరవేస్తున్నారు. మరి పట్టుబడిన నిందితుల వెనక ఎవరున్నారు? పంజాబ్లో ఎవరికి డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.