Home /News /national /

RAJASTHAN RAJSAMAND GIRL KINJAL NARRATES SHOCKING STORY OF REINCARNATION FAMILY SHOCKED HERE IS STUNNING DETAILS SK

4 ఏళ్ల బాలిక పునర్జన్మ.. 9 ఏళ్ల క్రితం ఎలా చనిపోయిందో చెబుతోంది.. అన్నీ వాస్తవమే..

అప్పుడు ఉష.. ఇప్పుడు కింజల్...

అప్పుడు ఉష.. ఇప్పుడు కింజల్...

Reincarnation: పిప్లాంత్రి గ్రామానికి చెందిన ఉష అనే మహిళే.. తొమ్మిదేళ్ల తర్వాత పరవాల్ గ్రామంలో కింజల్‌గా పుట్టిందన్న మాట..! తనకు ఇద్దరు సోదరులు ఉన్నారని, తండ్రి ట్రాక్టర్ నడుపుతాడని ఆ పాప తన తల్లిదండ్రులతో చెప్పింది.

  గత ఏడాది వచ్చిన నాని సినిమా శ్యామ్ సింగరాయ్  సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పునర్జన్మ నేపథ్యంలో ఈ మూవీ వచ్చింది. ఐతే అచ్చం ఆ సినిమాలో చూపించినట్లుగానే రాజస్థాన్‌లో ఓ స్టోరీ వెలుగులోకి వచ్చింది. నాలుగేళ్ల బాలిక..  తాను 9 ఏళ్ల క్రితం ఎలా చనిపోయిందో చెబుతోంది. తాను పునర్జన్మ ఎత్తానని.. వేరొక గ్రామంలో తన గత జన్మకు సంబంధించిన కుటుంబం ఉందని చెప్పింది. ఆ చిన్నారి మాటలు విని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొదట పెద్దగా నమ్మలేదు గానీ.. ఆమె చెప్పేవన్నీ నిజం కావడంతో.. ఇదేం విడ్డూరమని ముక్కున వేలేసుకుంటున్నారు. అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా జరుగుతోందని విస్మయం చెందుతున్నారు.

  మనదేశంలో విచిత్ర రైల్వే స్టేషన్లు.. ఇలాంటివి ఎక్కడా ఉండవు.. వాటి ప్రత్యేకతలు ఇవే

  స్థానికుల కథనం ప్రకారం.. అది రాజస్థాన్‌లోని రాజ్‌సమంద్ జిల్లా నాథ్‌ద్వారాకు ఆనుకొని ఉన్న పరవాల్ గ్రామం. అక్కడ నివసించే రతన్ సింగ్ చుండావత్ అనే వ్యక్తికి ఐదు మంది కుమార్తెలు ఉన్నారు. అతడు ఓ చిన్న హోటల్‌లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఐతే అతడి చిన్న కుమార్తె కింజల్ ఏడాది నుంచి చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నాలుగేళ్ల ఆ పాప తన సోదరుడి గురించి ఏవేవో విషయాలు చెబుతోంది. కానీ వాస్తవానికి ఆమె సోదరులు లేరు. రతన్ సింగ్‌కు అందరూ కుమార్తెలే ఉన్నారు. కానీ ఆ చిన్నారి మాత్రం తనకు సోదరుడు ఉన్నాడని చెబుతోంది. మొదట్లో తాము పెద్దగా పట్టించుకోలేదని.. చిన్నపిల్లలు కదా.. ఏవేవో చెబుతారని భావించినట్లు ఆమె తాత రామ్ సింగ్ చుండావత్ తెలిపారు. కానీ రెండు నెలల క్రితం పాప తల్లి దుర్గ.. మీ సోదరుడు ఎక్కడుంటాడు? అని అడగడంతో.. ఆ పాప పిప్లాంత్రి గ్రామంలో.. అని సమాధానం చెప్పింది. ఆ ఊరు పరవాల్‌కు 30 కి.మీ. దూరంలోనే ఉంది. తన పేరు ఉష అని.. కుటుంబ సభ్యులంతా అక్కడే ఉంటాని చెప్పింది.

  OMG: తన పీరియడ్స్ రక్తాన్ని తాగుతున్న మహిళ.. ముఖానికీ ఫేసియల్.. ఎన్నో లాభాలున్నాయట..

  ఆ పాప చెబుతున్న దాని ప్రకారం..పిప్లాంత్రి గ్రామానికి చెందిన ఉష అనే మహిళే.. తొమ్మిదేళ్ల తర్వాత పరవాల్ గ్రామంలో కింజల్‌గా పుట్టిందన్న మాట..! తనకు ఇద్దరు సోదరులు ఉన్నారని, తండ్రి ట్రాక్టర్ నడుపుతాడని ఆ పాప తన తల్లిదండ్రులతో చెప్పింది. వారు పిప్లాంత్రిలో ఉంటారని.. అత్తామామలు ఓడన్లో ఉంటారని వివరించింది. అంతేకాదు.. తాను సిలిండర్ పేలి.. కాలిన గాయాలతో తొమ్మిదేళ్ల క్రితం మరణించానని తెలిపింది. పిప్లాంత్రి గ్రామం నుంచి అంబులెన్స్‌లో ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. పరవాల్ గ్రామ సమీపంలో మార్గమధ్యలోనే మరణించినట్లు చెప్పింది.

  ఆ నోటా ఈ నోటా పడి.. కింజల్ గురించి పిప్లాంత్రికి చెందిన పంకజ్‌కు తెలిసింది. పంకజ్ ఎవరో కాదు ఉష సోదరుడు. ఆ పాప స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉండడంతో వెంటనే పరవాల్ గ్రామానికి వెళ్లి కింజల్‌ను చూశాడు. తనను చూడగానే ఆ పాప సంతోషంతో ఉప్పొంగిపోయిందని పంకజ్ తెలిపారు. తన ఫోన్‌లో అమ్మ ఫొటోను చూపించగానే వెక్కివెక్కి ఏడ్చింది. ఆ తర్వాత జనవరి 14న కింజాల్.. తన తల్లితండ్రి, తాతతో కలిసి పిప్లాంత్రికి వెళ్లింది. అక్కడికి రాగానే తమను చూసి సంతోష పడిందని ఉష తల్లి గీతాపలివాత్ చెప్పింది. గ్రామానికి చెందిన కొందరు మహిళలను గుర్తుపట్టి.. వారితో కూడా ఆ పాప మాట్లాడింది. తాను కొన్ని పూల మొక్కలు నాటానని.. ఆ మొక్కలెక్కడని ప్రశ్నించడంతో.. వాటిని 8 ఏళ్ల క్రితమే తొలగించామని ఉష కుటుంబ సభ్యులు చెప్పారు.  2013లో ఉష ఇంట్లో పని చేస్తున్నప్పుడు గ్యాస్‌ స్టవ్‌ తగిలి మంటలు అంటుకున్నాయని..ఆ ప్రమాదంలోనే ఉష మరణించిందని ఆమె తల్లి గీత చెప్పింది. ఉషకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. ఇప్పుడు కింజాల్ కూడా ఇదే విషయాన్ని చెబుతోంది. ఈ సంఘటన తర్వాత కింజల్, ఉష కుటుంబానికి మధ్య ఒక ప్రత్యేకమైన అనుబంధం ఏర్పడింది. కింజల్ ప్రతిరోజు తన గత జన్మకి సంబంధించిన కుటుంబంతో టచ్‌లో ఉంటోంది. తన అన్నయ్య ప్రకాష్, సోదరి హీనాతో నిత్యం ఫోన్‌లో మాట్లాడుతోంది. తమకు కూడా ఉషతో మాట్లాడుతున్నట్లే అనిపిస్తోందని.. గతంలో జరిగిన అన్నింటిని ఆ పాప చెబుతోందని ఉష తల్లి చెబుతోంది. చిన్నప్పుడు ఉష ఎలా మాట్లాడేదో.. ఇప్పుడు కింజల్ కూడా అచ్చం అలానే మాట్లాడుతోందని వెల్లడించింది.

  Tea Facts: మనం రోజూ తాగే టీ గురించి మీకు తెలియని... కొన్ని నిజాలు..!

  కింజల్ వయసు నాలుగేళ్లే. ఇంకా స్పష్టంగా మాట్లాడలేదు. కానీ తన హావభావాలతో ఉష కుటుంబానికి కావాల్సిన ప్రతి విషయాన్ని తెలియజేస్తోంది. పాప పరిస్థితిని చూసి మొదట ఆమె తల్లిదండ్రులు మానస్థిక వ్యాధేమోనని అనుకున్నారు. ఎంతో మంది డాక్టర్లకు చూపించారు. కానీ తగ్గలేదు. చివరకు పిప్లాంత్రి గ్రామానికి వెళ్లిచ్చిన తర్వాత వారికి క్లారిటీ వచ్చింది. 9 ఏళ్ల క్రితం మరణించిన ఉష.. నాలుగేళ్ల క్రితం కింజాల్‌గా తమ ఇంట్లో పుట్టిందని అర్ధమయింది. ఎందుకంటే ఆమె తన గత జన్మకు సంబంధించి చెప్పే ప్రతి విషయం నిజంగానే జరిగిందని.. అందుకే తాము నమ్ముతున్నామని ఇటు కింజల్.. అటు ఉష కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Rajasthan, Viral story

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు