Home /News /national /

RAJASTHAN MAJOR FIRE BREAKS OUT IN VEGETABLE MARKET DHOLPUR MANY SHOPS BURNT TO ASHES PAH

Fire Breaks: వెజిటేబుల్ మార్కెట్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎక్కడంటే..

మంటల్లో దుకాణాలు

మంటల్లో దుకాణాలు

Rajasthan: ధోల్ పూర్ లోని నిహల్ గంజ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. దీంతో జనాలు భయంతో పరుగులు తీశారు. డజనుకు పైగా దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.

రాజస్థాన్ లోని (Rajasthan) ధోల్ పూర్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. నిహల్ గంజ్ లో వెజిటేబుల్ మార్కెట్ లో శనివారం సాయంత్రం తర్వాత.. భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో మార్కెట్ కు వచ్చిన వారు అక్కడి నుంచి పారిపోయారు. చూస్తుండగానే మంటలు అక్కడ ఉన్న అనేక దుకాణాలకు వ్యాపించాయి. వెంటనే స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ప్రమాద స్థలానికి చేరుకున్న సిబ్బంది.. స్థానికులతో కలసి సహాయక చర్యలు చేపట్టారు.

దీనిలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించక పోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ముందు జాగ్రత్తగా అక్కడ ఉన్నవారిని ఖాళీ చేయించారు. వ్యాపారులు.. దుకాణాలను మూసి వేస్తున్న క్రమంలో.. ఒక షాపులో మంటలు వ్యాపించాయి. వెంటనే ఇతర దుకాణాలకు కూడా మంటలు అంటుకున్నాయి. సాధారణంగా, కూరగాయల మార్కెట్లలో చెక్క నిర్మాణాలను నిర్మించడం ద్వారా దుకాణాలు నిర్మిస్తారు, దాని కారణంగా మంటలు త్వరగా వ్యాపించాయి మరియు ఇతర మండే వస్తువులను బస్తాలలో ఉంచుతారు. దీంతో మంటలు చాలా వేగంగా వ్యాపించాయి.



ఇదిలా ఉండగా గతంలో హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం (Hyderabad Fire Accident) జరిగింది.

సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతంలో ఉన్న ఓ స్క్రాప్ గౌడౌన్‌ (Bhoiguda Scrap godown fire accident) లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదంలో 10 మంది కార్మికులు సజీవదహనమయ్యారు. రాత్రి 2.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో ఇంకా మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగలు అలుముకున్నాయి. వాటిని అదుపుచేసేందుకు 8 అగ్నిమాపక యంత్రాలతో ఫైర్ ఫైటర్స్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటి వరకు 10 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. ఆ మృతదేహాలను గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ప్రమాద సమయంలో స్క్రాప్ గోడౌన్‌లో 12 మంది పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆ గోడౌన్ రెండతస్తుల్లో ఉంది. పై అంతస్తులో కార్మికులు అర్ధరాత్రి వరకు పనిచేసిన తర్వాత.. అక్కడే నిద్రపోయారు. వారు గాఢ నిద్రలో ఉన్న సమయంలో కింది అంతస్తులో మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. కింది అంతస్తు నుంచి పై వరకు మంటలు ఎగిసిపడ్డాయి. కిందకు వెళ్లేందుకు.. అక్కడి నుంచి బయటకు వెళ్లేందుకు.. ఒకే మార్గం ఉండడం.. అక్కడ పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో.. కార్మికులు ఎటూ వెళ్లలేకపోయారు. పై అంతస్తులోనే ఉండిపోయి.. అగ్నికి ఆహుతయ్యారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో గుర్తుపట్టడం కూడా కష్టంగా మారింది.
Published by:Paresh Inamdar
First published:

Tags: Fire Accident, Rajasthan

తదుపరి వార్తలు