మొక్కే కదాని పీకేస్తే పీక కోస్తా.. స్టైల్లో భారీ డైలాగులు లేవు. కానీ పైసా కూడా వదులుకోలేననే సర్కారువారి పాట హీరో టైపు మనిషి తను. 35 రూపాయల కోసం ఏకంగా ఐదేళ్లు న్యాయపోరాటం చేశాడు. పోరాటం ఒంటరిదే అయినా, తనతోపాటు మరో 3 లక్షల మందికి న్యాయం చేయగలిగాడు అతను. వివరాలివే..
రూ.35 రిఫండ్ కోసం భారత రైల్వేతో ఐదేండ్లు పోరాటం చేశాడు ఓ యువ ఇంజినీర్. పోరాటం ఫలించింది. రూ.35 రిఫండ్ చేయడానికి రైల్వే అంగీకరించింది. అయితే, అతనొక్కడికే కాదు. అతని లాగా టికెట్ క్యాన్సిల్ చేసుకొన్న 2.98 లక్షల మందికి కూడా రూ.35 చొప్పున తిరిగి ఇవ్వాలని నిర్ణయించింది.
ఫలితంగా మొత్తం రూ.2.43 కోట్లను రిఫండ్ చేయాల్సి వచ్చింది. రాజస్థాన్‌కు చెందిన సుజీత్ స్వామి(30) ఢిల్లీ నుంచి గోల్డెన్ టెంపుల్ వెళ్లడానికి 2017 ఏప్రిల్‌లో ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకొన్నారు. 2017 జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చింది. అప్పుడు..
జీఎస్టీ కంటే మముందే సుజీత్ టికెట్ క్యాన్సిల్ చేసుకొన్నారు. కానీ, ఐఆర్సీటీసీ టికెట్ రద్దుకు సర్వీస్ చార్జి పేరుతో రూ.35 ఎక్కువ కట్ చేసుకొన్నది. 2.98 లక్షల మందికి ఇలాగే జరిగింది. అయితే ఇవేవీ తెలియకుండానే సుజీత్ తన రూ.35 కోసం 50కి పైగా ఆర్టీఐ దరఖాస్తులతో రైల్వేను ప్రశ్నించాడు. చివరకు రైల్వే దిగొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: GST, Indian Railway, Rajasthan