హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Intresting : భార్యకు కడుపు చేయడానికి..జీవిత ఖైదీ అయిన భర్తకు 15 రోజుల పెరోల్

Intresting : భార్యకు కడుపు చేయడానికి..జీవిత ఖైదీ అయిన భర్తకు 15 రోజుల పెరోల్

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Parole To Convict : ఖైదీ భార్యకు సంతానం పొందే హక్కు లేకుండా చేయబడింది, అయితే ఆమె ఎలాంటి నేరం చేయలేదు మరియు ఎలాంటి శిక్షకు గురికాకూడు. అందువల్ల, ఖైదీలు, ముఖ్యంగా సంతానం కోసం తన భార్యతో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడం అతని భార్య హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది" అని కోర్టు పేర్కొంది.

ఇంకా చదవండి ...

Parole To Convict : రాజస్తాన్ హైకోర్టు శుక్రవారం ఓ కేసులో ఇంట్రెస్టింగ్ తీర్పునిచ్చింది. భార్యతో కలిసి బిడ్డను కలిసి కనేందుకు జీవితఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. రాజస్తాన్ కి చెందిన లాల్ అనే వ్యక్ది ఓ కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్నాడు. అయితే తనకు 15రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని లాల్..అజ్మీరు జిల్లా కమిటీకి పిటిషన్ సమర్పించారు. జిల్లా కమిటీ జీవిత ఖైదు పడిన లాల్ కు పెరోల్ ఇవ్వలేదు. అయితే తన భర్తకు 15రోజుల పాటు పెరోల్ మంజూరు చేయాలని కోరుతూ లాల్ భార్య రాజస్తాన్ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. తనకు వివాహం అయినా పిల్లలు లేరని, తన వైవాహిక జీవితంలో లైంగిక, భావోద్వేగ అవసరాలు తీరడంతోపాటు..తనకు బిడ్డ పుట్టడం కోసం భర్తకు 15రోజుల పెరోల్ ఇవ్వాలని భార్య హైకోర్టును అభ్యర్థించింది.

దీనిపై విచారణ జరిపిన హైకోర్టు..వివాహం అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ జంటకు ఎటువంటి సమస్య లేదని, వంశ పరిరక్షణ కోసం సంతానం కలిగి ఉండటం మత తత్వాలు, భారతీయ సంస్కృతి మరియు వివిధ న్యాయపరమైన అంశాల ద్వారా గుర్తించబడిందని పేర్కొంటూ కోర్టు..జీవిత ఖైదు అయిన భర్తకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. ఖైదీ భార్యకు సంతానం పొందే హక్కు లేకుండా చేయబడింది, అయితే ఆమె ఎలాంటి నేరం చేయలేదు మరియు ఎలాంటి శిక్షకు గురికాకూడు. అందువల్ల, ఖైదీలు, ముఖ్యంగా సంతానం కోసం తన భార్యతో వైవాహిక సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించడం అతని భార్య హక్కులను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది" అని కోర్టు పేర్కొంది. రూ. 25వేల చొప్పున రెండు పూచీకత్తులతోపాటు రూ.50వేల వ్యక్తిగత బాండ్ ను అందించి లాల్ ను 15రోజుల పెరోల్ పై విడుదల చేయాలని హైకోర్టు ఆదేశించింది.

Published by:Venkaiah Naidu
First published:

Tags: High Court, Rajastan

ఉత్తమ కథలు