Free Smartphone To Women : మహిళలకు ఉచితంగా స్మార్ట్ఫోన్లు(Smart Phones), మూడేళ్ల పాటు ఉచిత 4G ఇంటర్నెట్ అందించాలని రాజస్తాన్(Rajastan) ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ముఖ్యమంత్రి డిజిటల్ సేవా యోజన స్కీంతో ముందుకొచ్చింది అశోక్ గహ్లోత్ ప్రభుత్వం. వచ్చే ఏడాది ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ"ఉచిత' స్కీమ్"కు శ్రీకారం చుట్టింది. వాస్తవానికి ఈ పథకాన్ని ఈ ఏడాది బడ్జెట్‌లోనే ప్రకటించారు. తాజాగా దీనికి సంబంధించిన విధివిధానాలు, టెండర్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెలాఖరుకల్లా బిడ్లను ఖరారు చేయనున్నారు. ఇందుకోసం మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు బీఎస్‌ఎన్‌ఎల్ కూడా పోటీ పడుతోంది. ఈ పండగ సీజన్‌లోనే తొలిదశ స్మార్ట్‌ఫోన్ల పంపిణీ చేపట్టాలని సర్కారు భావిస్తోంది.
రాజస్తాన్ ప్రభుత్వం ఇప్పటికే చిరంజీవి హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరిట అందిస్తున్న ఆరోగ్య బీమా పథకంలో చేరిన కుటుంబాల్లోని దాదాపు 1.35 కోట్ల మంది మహిళలకు ఈ ఫోన్లు అందించనున్నారు. వీరికి మూడేళ్ల పాటు ఉచితంగా 4G ఇంటర్నెట్ సదుపాయం కూడా కల్పిస్తారు. ఇందులో మొదటి సిమ్‌కార్డు లాక్ చేసి ఉంటుంది. రెండో సిమ్ స్లాట్‌లో ఇంకో సిమ్ కార్డు వేసుకునే వీలుంటుంది. ఒక్కో మొబైల్ హ్యాండ్‌సెట్ ధరకి రూ.5639కానున్నట్లు సమాచారం. పేద మహిళలకు సాధికారత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఉచిత డేటా-ఎనేబుల్ మొబైల్ హ్యాండ్‌సెట్‌లను అందించిన దేశంలోని మొదటి రాష్ట్రంగా రాజస్తాన్ నిలిచింది.
వీడు మామూలోడు కాదు : 8 మందితో ఒకేసారి పెళ్లి..భార్యలతో శృంగారానికి టైమ్ టైబుల్
ఈ పథకంపై సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ.... ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా సదరు మహిళల పిల్లలు ఆన్‌లైన్‌లో అధ్యయనం చేయడానికి వీలు కలుగుతుందని, అంతేకాకుండా గ్రామ మహిళలు స్మార్ట్‌ఫోన్‌ను స్వీకరించిన తర్వాత ఎక్కువ ప్రయోజనాలను పొందుతారని అన్నారు. వచ్చే ఏడాది 2023-24 వార్షిక బడ్జెట్‌ను యువత, విద్యార్థులకు అంకితం చేయనున్నామని సీఎం అన్నారు. గత 44 నెలల పాలనలో తమ ప్రభుత్వం 1.30 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించి ఉపాధి కల్పించిందని, వివిధ శాఖల్లో దాదాపు లక్ష కొత్త ఉద్యోగాలు పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని సీఎం చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rajastan, Smart phones