Rajasthan : మనలో చాలా మందికి బైకో, బండో వేసుకెళ్లడం అలవాటు ఉంటుంది గానీ... హెల్మెట్ పెట్టుకునే విషయంలో మర్చిపోతుంటాం. ఎందుకంటే... హెల్మెట్ పెట్టుకోవడమనేది మనలో చాలా మందికి నచ్చదు. కానీ ఈ అలవాటును తప్పనిసరి చేసేందుకు రాజస్థాన్ ప్రభుత్వం తెలివైన ఆలోచనతో ముందుకొచ్చింది.
మీకు తెలుసుగా... కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్ చట్టాన్ని తెచ్చిందని. దాని ప్రకారం... ఎవరైనా హెల్మెట్ లేకుండా బండి నడిపితే... రూ.1000 ఫైన్ విధిస్తున్నారు. ఐతే... చాలా మంది ఫైన్ కట్టాలంటే... బాధపడుతున్నా్రు. ఈ ఒక్కసారికీ వదిలేయమనీ... నెక్ట్స్ టైమ్ తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకుంటానని ట్రాఫిక్ పోలీసుల్ని బతిమలాడుతున్నారు. కొందరైతే... హెల్మెట్ లేదనీ... ఇప్పుడే వెళ్లి కొనుక్కుంటామని చెబుతున్నారు. ఎవరు ఎన్ని చెప్పినా... రాజస్థాన్ పోలీసులు ఫైన్ కట్టాల్సిందేనని చెబుతున్నారు. ఐతే... వాహనదారుల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక... ఫైన్ కట్టిన వారికి తామే ISI మార్క్ ఉన్న హెల్మెట్‌ను ఫ్రీగా ఇస్తున్నారు. తద్వారా వాహనదారులకు కొంత వరకూ ఉపశమనం కలిగిస్తున్నారు. ఎందుకంటే... విడిగా హెల్మెట్ కొనుక్కోవాలన్నా రూ.1000 దాకా ఉంటుంది. కొన్నైతే రూ.2000 దాకా ఉంటాయి. అందువల్ల ఫైన్ రూ.1000 పోయినా... కొత్త హెల్మెట్ తమ చేతికి వచ్చిందని భావిస్తూ... వాహనదారులు... పోలీసుల తీరును మెచ్చుకుంటున్నారు.
నిజానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త ట్రాఫిక్ చట్టంలో చాలా ఫైన్లను రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చెయ్యట్లేదు. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. ప్రజల పరిస్థితులను అర్థం చేసుకొని... కొత్త చట్టాన్ని ఏ మేరకు అమల్లోకి తేవాలనే అంశంపై తాము చర్చిస్తున్నట్లు తెలిపారు రాజస్థాన్ రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సింగ్.
ఈ అంశంపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్... కొత్త చట్టాన్ని అమలు చేస్తూనే... కొన్ని అంశాల్లోనే భారీ ఫైన్లు వెయ్యాలని సూచించారు. అలాగే... వాహనదారులను మరీ ఇబ్బంది పెట్టవద్దన్నారు. ట్రాఫిక్ సేఫ్టీపై ప్రజల్లో అవగాహన పెంచడంపై దృష్టిసారించాలని రవాణా శాఖనూ, పోలీసుల్నీ కోరారు. దాంతో భారీ ట్రాఫిక్ ఉల్లంఘనలను మాత్రమే సీరియస్‌గా తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
బండి నడిపేవారికి... రూ.1000 ఫైన్ చెల్లించే స్థోమతే ఉంటే... అదే డబ్బుతో ఆ ఫైన్ బదులు వాళ్లు హెల్మెటే కొనుక్కుంటారు. ఈ విషయాన్ని కేంద్రం గమనించాలంటున్న రాజస్థాన్ ప్రభుత్వం... తాము మాత్రం వాహనదారులను ఇబ్బంది పెట్టట్లేదని చెబుతున్నారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.