కరోనా అంటించారని రూ.6 లక్షల జరిమానా విధించిన కలెక్టర్..

నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ విజృంభించేందుకు కారకలవుతున్నారు. ఎంత చెప్పినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండడంతో ఓ కలెక్టర్‌కు భలే ఐడియా తట్టింది.

news18-telugu
Updated: June 28, 2020, 7:58 AM IST
కరోనా అంటించారని రూ.6 లక్షల జరిమానా విధించిన కలెక్టర్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ మహమ్మారి పేరు వింటేనే ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. దేశంలోనూ రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్ విధించడంతో పాటు నిబంధనలు పాటించాలని చెప్పాయి. కానీ కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కరోనా వైరస్ విజృంభించేందుకు కారకలవుతున్నారు. ఎంత చెప్పినా నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తుండడంతో ఓ కలెక్టర్‌కు భలే ఐడియా తట్టింది. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా వైరస్ సోకేందుకు కారణమైన ఓ కుటుంబానికి రూ.6 లక్షలు జరిమానా విధించారు. ఈ ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈనెల 13న తన కొడుక్కి పెళ్లి చేశాడు.

నిబంధనలను ఉల్లంఘించి కరోనా విజృంభిస్తున్న సమయంలో పెళ్లి వేడుకకు భారీ సంఖ్యలో అతిథులను ఆహ్వానించారు. వివాహ వేడుక అనంతరం పెళ్లికి హాజరైన వారిలో 15 మందికి కరోనా వైరస్ సోకినట్టు తేలింది. వీరిలో ఒకరు చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈనెల 22న కేసు నమోదు చేశారు. ఇదిలావుంటే.. కరోనా సోకిన 15 మందిని ప్రభుత్వం ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించింది.

అయితే ఈ 15 మందికి కరోనా టెస్టులు చేయడం, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌కు మొత్తంగా రూ.6,26,600 వ్యయం అయ్యింది. నిర్లక్ష్యం వ్యవహరించి 15 మందికి కరోనా సోకేందుకు కారణమైన వ్యక్తి నుంచే డబ్బులు రాబట్టాలని భిల్వారా జిల్లా కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులను ఆదేశించారు. జరిమానా విధించిన డబ్బును వసూలు చేసి సీఎం రిలీఫ్ ఫండ్‌కు డిపాజిట్ చేయాలని చెప్పారు.
First published: June 28, 2020, 7:58 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading