Rajasthan Elections: రాజస్థాన్‌లోనూ నేడే పోలింగ్... ఏర్పాట్లు పూర్తి

Rajasthan assembly elections 2018 | ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి.

news18-telugu
Updated: December 7, 2018, 1:05 AM IST
Rajasthan Elections: రాజస్థాన్‌లోనూ నేడే పోలింగ్... ఏర్పాట్లు పూర్తి
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: December 7, 2018, 1:05 AM IST
తెలంగాణతో పాటు రాజస్థాన్‌లోనూ ఇవాళే పోలింగ్ జరగనుంది. ఇప్పటికే అన్ని చోట్లా ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాజస్థాన్‌లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఐతే రామ్‌గఢ్ బీఎస్పీ అభ్యర్థి మరణించడంతో ఆ నియోజకవర్గంలో ఎన్నికను వాయిదా వేశారు. మిగిలిన 199 అసెంబ్లీ స్థానాల్లో 2,274 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వీరిలో 189 మంది మహిళలు ఉన్నారు. రాజస్థాన్‌లో మొత్తం 4.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు తాజా లెక్కలు చెబుతున్నాయి.  130 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ ఉంది. 50 చోట్ల రెండు పార్టీల నుంచీ రెబల్స్ బరిలో దిగడంతో పోటీ రసవత్తరంగా మారింది.

Rajasthan assembly elections 2018 | ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.  ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి. Rajasthan, Rajasthan elections 2018, Rajasthan  assembly elections, vasundhara raje, sachin pilot,  రాజస్థాన్ ఎన్నికలు, వసుంధరా రాజే, సచిన్ పైలెట్
ప్రతీకాత్మక చిత్రం

కాంగ్రెస్ తరపున రాహుల్ గాంధీ, రాజస్థాన్ పీసీసీ చీఫ్ సచిన్ పైలట్, మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ప్రచారం చేశారు. బీజేపీ తరపున ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం చేశారు. ఇక రాజస్థాన్ సీఎం వసుంధర రాజే రాష్ట్రమంతా పర్యటించి.. బీజేపీ గెలుపు కోసం సర్వశక్తులూ ఒడ్డారు. బీఎస్పీ అభ్యర్థుల తరపున ఆ పార్టీ చీఫ్ మాయావతి ప్రచారం నిర్వహించారు.

Rajasthan assembly elections 2018 | ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే రాజస్థాన్ ప్రజలు ఈసారి ఎవరిని గెలిపిస్తారన్నది ఆసక్తిగా మారింది.  ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి. Rajasthan, Rajasthan elections 2018, Rajasthan  assembly elections, vasundhara raje, sachin pilot,  రాజస్థాన్ ఎన్నికలు, వసుంధరా రాజే, సచిన్ పైలెట్
ప్రతీకాత్మక చిత్రం
రాజస్థాన్ ప్రజలు ప్రతి ఐదేళ్ల కోసారి ప్రభుత్వాన్ని మార్చడం ఆనవాయితీగా వస్తోంది. ఐతే ఈసారి కూడా అధికార మార్పిడి జరుగుతుందని..కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని మెజారిటీ సర్వేలు తెలిపాయి. మరి నిజంగానే కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుందా? లేదంటే అధికారాన్ని నిలుపుకొని బీజేపీ చరిత్ర సృష్టిస్తుందా? అనేది ఆసక్తిగా మారింది. కాగా, డిసెంబరు 11న తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరంతో పాటు రాజస్థాన్ ఎన్నికల ఫలితాలు వెల్లడవుతాయి.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు