RAJASTHAN CONGRESS MLA GANESH GHOGRA CLOSE TO CM ASHOK GEHLOT RESIGNS SAYS WAS BEING IGNORED MKS
Ganesh Ghogra: ఇలాంటి కారణంతో ఓ ఎమ్మెల్యే రాజీనామా చేయడం ఎప్పుడైనా విన్నారా!!
గణేశ్ ఘోగ్రా
ఇటీవలే చింతన్ శిబిర్ నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ కార్యక్రమ వేదిక అయిన రాజస్థాన్ లో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే, సీఎం అశోక్ గెహ్లాట్ కు అత్యంత సన్నిహితుడైన గణేశ్ ఘోగ్రా పార్టీకి, పదవికి రాజీనామా చేశారు.
సుదీర్ఘ వైఫల్యాలకు చికిత్సగా ఇటీవలే చింతన్ శిబిర్ నిర్వహించుకున్న కాంగ్రెస్ పార్టీకి ఆ కార్యక్రమ వేదిక అయిన రాజస్థాన్ లో అనూహ్య ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే, సీఎం అశోక్ గెహ్లాట్ కు అత్యంత సన్నిహితుడైన గణేశ్ ఘోగ్రా పార్టీకి రాజీనామా చేశారు. రాజస్థాన్‌లోని డంగార్పూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తోన్న గణేశ్ తన రాజీనామాకు చెబుతోన్న కారణం బహుశా అరుదైనది కావొచ్చు..
తాను ఎమ్మెల్యే అయినప్పటికీ.. పార్టీలో ఎవ్వరూ పట్టించుకోవడం లేదని అందుకే రాజీనామా చేస్తున్నానని గణేశ్ ఘోగ్రా ప్రకటించారు. అంతేకాదు, అటు అధికార యంత్రాంగం కూడా తనను లెక్క చేయడం లేదని, ప్రజా సమస్యలు చెబితే, పరిష్కరించడం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ కారణంగానే తాను రాజీనామా చేస్తున్నానని చెప్పారు. తన రాజీనామా లేఖను ఆయన రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్‌కు, సీఎం గెహ్లాత్‌కు, పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు.
రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ వేదికగా కాంగ్రెస్ ఇటీవలే చింతన్ శిబిర్ నిర్వహించగా, ఆ కార్యక్రమాల కమిటీల్లోనూ ఎమ్మెల్యే గణేశ్ ఘోగ్రాకు ప్రాధాన్యం దక్కనట్లు తెలుస్తోంది. కాగా, గణేశ్ వ్యవహారం త్వరలోనే సమసిపోతుందని రాజస్థాన్ కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
మరోవైపు.. గుజరాత్లో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదర్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్ వేదికగా ప్రకటించారు. ‘నా నిర్ణయాన్ని నా సహచరులు గుజరాత్ ప్రజలు స్వాగతిస్తారనని నమ్ముతున్నాను. కాంగ్రెస్ నుంచి బయటకు రావడం ద్వారా భవిష్యత్తులో గుజరాత్ కోసం సానుకూలంగా పనిచేయగలనని విశ్వసిస్తున్నాను’ అని ట్విటర్లో రాసుకొచ్చారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.