హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Gajendra Singh Shaktawat: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. కరోనాతో పాటు..

Gajendra Singh Shaktawat: అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. కరోనాతో పాటు..

గజేంద్ర సింగ్ షెకావత్ (ఫైల్ ఫొటో)

గజేంద్ర సింగ్ షెకావత్ (ఫైల్ ఫొటో)

రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విషాధం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ షెకావత్ అనారోగ్య కారణాలతో బుధవారం ఉదయం మరణించారు. ఢిల్లీలోని ఆస్పత్రిలో నెలన్నరగా ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నారు. కరోనాతోపాటు..

  రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటుచేసుకుంది. ఆ పార్టీ ఎమ్మెల్యే గజేంద్ర సింగ్ షెకావత్ అనారోగ్య కారణాలతో బుధవారం ఉదయం మరణించారు. ఓ సీనియర్ నేతగా కాంగ్రెస్ పార్టీకి ఆయన ఎనలేని సేవలను అందించారు. పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. ప్రస్తుతం ఉదయ్ పూర్ జిల్లాలోని వల్లభ్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్ ముఖ్య అనుచరుల్లో ఒకరిగా పేరుతెచ్చుకున్నారు. ఇటీవల రాష్ట్ర కాంగ్రెస్ లో చోటు చేసుకున్న సంక్షోభంలో ఆయన సచిన్ పైలట్ వెంట ఉండి, ఆయన మద్దతుదారుల క్యాంప్ రాజకీయాలను దగ్గరుండి చూసుకున్నారు. 48 ఏళ్ల వయసు కలిగిన ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు నియోజకవర్గంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. వల్లభ్ నగర్ ఎమ్మెల్యేగా ఆ నియోజకవర్గంలో బాగానే అభివృద్ధి పనులను చేశారు.

  నెలన్నర నుంచి షెకావత్ ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. జాండిస్ తోపాటు కరోనా కూడా సోకడంతో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే షెకావత్ ప్రాణాలు కోల్పోయారని ఉదయ్ పూర్ జిల్లా కాంగ్రెస్ మాజీ అధికార ప్రతినిధి పంకజ్ శర్మ వెల్లడించారు. కాగా, గజేంత్ర షెకావత్ మృతి పట్ల రాజస్థాన్ కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలెట్ స్పందించారు. ట్విటర్ వేదికగా తన నివాళులను అర్పించారు. ’నాతో పాటు ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన ఎమ్మెల్యే శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మరణించారన్న దురదృష్టకరమైన వార్త నా మనసును కలచివేసింది. ఆయన ఎంతో ప్రేమ మూర్తి. దయార్థహృదయుడు. తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎంతో పరితపిస్తూ ఉండేవాడు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను‘ అని సచిన్ పైలట్ ట్వీట్ చేశారు. ఆయనతో తన సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా ఆయన విలేకరులతో పంచుకున్నారు.

  గజేంద్ర సింగ్ షెకావత్ మృతి పట్ల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ కూడా స్పందించారు. గత కొంతకాలంగా షెకావత్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారనీ, ఆయన త్వరగా కోలుకుని తనతో కలిసి పనిచేస్తారని ఆశించానన్నారు. గడిచిన పదిహేను రోజులుగా డాక్టర్లతోనూ, షెకావత్ కుటుంబ సభ్యులతోనూ మాట్లాడుతూనే ఉన్నానన్నారు. ఆయన మరణం తనను కలిచి వేసిందని, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని వివరించారు. షెకావత్ మరణం పట్ల ఆయన కుటుంబానికి సానుభూతిని తెలుపుతూ అశోక్ గెహ్లట్ ఓ ట్వీట్ లో పేర్కొన్నారు.

  Published by:Hasaan Kandula
  First published:

  Tags: Ashok Gehlet, Congress, Rajasthan, Sachin Pilot

  ఉత్తమ కథలు