హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి.. ఆస్పత్రిలో చేరిక

Ashok Gehlot: రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్‌కు తీవ్రమైన ఛాతీ నొప్పి.. ఆస్పత్రిలో చేరిక

అశోక్ గహ్లోత్

అశోక్ గహ్లోత్

Ashok Gelhot: 70 ఏళ్ల వయసున్న అశోక్ గహ్లోత్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా బారినపడ్డారు. చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. ఐతే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత.. ఆయన రకరకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది

రాజస్థాన్ (Rajasthan) సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot) అస్వస్థతకు గురయ్యారు.  గురువారం నుంచి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో ఆయన్ను శుక్రవారం ఉదయం ఆస్పత్రికి తరలించారు. జైపూర్‌ (Jaipur)లోని ఎస్ఎంఎస్ హాస్పిటల్‌లో పరీక్షలు జరిపారు. తనకు ఏంజియోప్లాస్టీ జరుగుతుందని అశోక్ గహ్లోత్ స్వయంగా ట్వీట్ చేశారు. ప్రస్తుతానికి తన ఆరోగ్యం నిలకబడగా ఉందని.. త్వరలో మీ ముందుకు వస్తానని పేర్కొన్నారు. అశోక్ గహ్లోత్ ఆస్పత్రిలో చేరినందున ఆయన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆయన ఆరోగ్యంపై పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ నేతలు తెలిపారు. క్షేమంగానే ఉన్నారని వెల్లడించారు.

''కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాకు కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చాయి. నిన్నటి నుంచి ఛాతీలో తీవ్రమైన నొప్పి ఉంది. ఎస్ఎంఎస్ ఆస్పత్రిలో సీటీ ఏంజీయో చేయించుకున్నా. ఏంజియోప్లాస్టీ జరగాల్సి ఉంది. అది జరుగుతుందన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. మీ అందరి ఆశీస్సులో త్వరలోనే మళ్లీ తిరిగొస్తా.'' అని అశోక్ గహ్లోత్ ట్వీట్ చేశారు.

Helicopter for sale: రండి బాబు రండి..తక్కువ ధరకే హెలికాప్టర్..ఏకంగా రూ.26కోట్లు డిస్కౌంట్

70 ఏళ్ల వయసున్న అశోక్ గహ్లోత్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కరోనా (Coronavirus) బారినపడ్డారు. అనంతరం ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అనంతరం తిరిగి కోలుకున్నారు. ఐతే కోవిడ్ నుంచి బయటపడిన తర్వాత తన నివాసం నుంచే పనిచేస్తున్నారు. ఐతే వ్యాధి నుంచి కోలుకున్న అనంతరం.. అశోక్ గహ్లోత్ రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే గురువారం ఆయన ఛాతీ నొప్పి వచ్చింది. నొప్పి ఎక్కువగా ఉండడంతో ఇవాళ ఉదయం ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ఏంజియోప్లాస్టీ చేసిన తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు తెలిపారు.

క్రికెట్‌లో మరో ఆవిష్కరణ.. సీపీఎల్‌లో చిప్‌తో కూడిన స్మార్ట్ బాల్.. దీని విశేషాలు ఏంటో  తెలుసా?

కాగా, రాజస్థాన్‌లో ప్రస్తుతం కరోనా పూర్తిగా అదుపులో ఉంది. రోజువారీ కొత్త కేసులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాజస్థాన్‌లో కేవలం ముగ్గురికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కోవిడ్19 నుంచి 17 మంది కోలుకున్నారు. నిన్న ఎవరూ మరణించలేదు. ప్రస్తుతం రాజస్థాన్‌లో 107 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. అక్కడ ఇప్పటి వరకు 9,54,051 మందికి కరోనా నిర్ధారణ అయింది. వీరిలో 9,44,990 మంది కోలుకోగా.. 8,954 మంది మరణించారు.

First published:

Tags: Ashok gehlot, Corona cases, Coronavirus, Covid-19, Rajasthan

ఉత్తమ కథలు