రాజస్థాన్‌లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో... ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తమ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి ఉన్న సాధారణ అనుమతిని ఆయన రద్దు చేశారు. దీంతో ముందు ముందు సీబీఐ విచారణ చేపట్టే కేసులకు సంబంధించి రాజస్థాన్ ప్రభుత్వానికి ముందస్తుగా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తమ పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు ఆడారని ఆరోపించిన రాజస్థాన్ సర్కార్... ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అయితే రాజస్థాన్ సర్కార్ అక్రమ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని బీజేపీ ఆరోపించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన రాజస్థాన్ ప్రభుత్వం.. తమ రాష్ట్రంలో సీబీఐ ఎంట్రీకి ఉన్న సాధారణ అనుమతులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
2019కి ముందు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనూ ఏపీలో సీబీఐపై ఇదే రకమైన నిర్ణయం తీసుకున్నారు. మోదీ ప్రభుత్వం సీబీఐ ద్వారా తమను ఇబ్బంది పెడుతోందని ఆరోపించిన నాటి టీడీపీ సర్కార్.. సీబీఐపై ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం సరైనదే అని వాదించింది. చంద్రబాబు తరహాలోనే ఆ తరువాత నాటి కర్ణాటక సీఎం కుమారస్వామితో పాటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం సీబీఐ ఎంట్రీపై ఇదే రకమైన నిర్ణయం తీసుకుని సంచలన సృష్టించారు. అయితే చంద్రబాబు తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్... సీబీఐ ఎంట్రీకి చంద్రబాబు సర్కార్ రద్దు చేసిన సాధారణ అనుమతిని మళ్లీ పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, CBI, Chandrababu naidu, Rajasthan