హోమ్ /వార్తలు /జాతీయం /

యూపీఏ స్థానంలో ఎన్‌డీఏ... రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కన్ఫ్యూజన్

యూపీఏ స్థానంలో ఎన్‌డీఏ... రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కన్ఫ్యూజన్

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(పీటీఐ ఇమేజ్)

రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్(పీటీఐ ఇమేజ్)

యూపీఏ, ఎన్‌డీఏ విషయంలో రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ సీఎం అశోక్ గెహ్లాట్ తికమకపడ్డారు. ఈ సందర్భంలో పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కలుగజేసుకుని అశోక్ గెహ్లాట్ ఎన్‌డీఏ అనబోయి యూపీఏ అన్నారని వివరణ ఇచ్చారు.

    ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్... పదే పదే కన్ఫ్యూజ్ అయ్యారు. ఆయనేదో మామూలు విషయంలో ఇలా తికమక పడితే ఎవరూ పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదేమో. కానీ కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ... బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ విషయంలోనే ఆయన కన్ఫ్యూజ్ కావడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2019లో యూపీఏ అధికారంలోకి రాబోతోందని చెప్పడానికి బదులుగా 2019లో యూపీఏ గద్దె దిగిపోతుందని అశోక్ గెహ్లాట్ అన్నారు. ఈ సందర్భంలో పక్కనే ఉన్న డిప్యూటీ సీఎం సచిన్ పైలెట్ కలుగజేసుకుని అశోక్ గెహ్లాట్ ఎన్‌డీఏ అనబోయి యూపీఏ అన్నారని వివరణ ఇచ్చారు.


    అంతటితో రాజస్థాన్ సీఎం కన్ఫ్యూజన్ తొలిగిపోలేదు. అదే సమయంలో మళ్లీ యూపీఏ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అశోక్ గెహ్లాట్ అన్నారు. దీంతో మరోసారి కలుగుజేసుకున్న సచిన్ పైలెట్... ఈ సారి ఆయన యూపీఏ అనాలని అనుకున్నారని వివరించారు. అయితే యూపీఏకు బదులుగా ఎన్‌డీఏ... ఎన్‌డీఏకు బదులుగా యూపీఏ అని అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. వారితో పాటు తాను చేసిన పొరపాటుకు అశోక్ గెహ్లాట్ కూడా నవ్వడం కొసమెరుపు.





    First published:

    Tags: Ashok Gehlet, Bjp, Congress, NDA, Rajasthan

    ఉత్తమ కథలు