రాజస్థాన్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ (Rajasthan Cabinet Reshuffle)కు సర్వం సిద్ధమయింది. ఇప్పటికే మంత్రుల జాబితాను కాంగ్రెస్ హైమాండ్ సిద్ధం చేసింది. కొత్త వారిలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ కీలక నేత సచిన్ పైలట్ (Sachin Pilot) వర్గానికి కూడా ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 15 మంది మంత్రులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. కేబినెట్ పునర్ వ్యవస్థీకరణపై సచిన్ పైలట్ హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూపులు లేవని.. నేతలంతా సోనియా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తామని చెప్పారు. 2023 ఎన్నికల్లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ పార్టీయే తిరిగి అధికారంలోకి వస్తుదని తెలిపారు. అలాగే 2024లో కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సచిన్ పైలట్.
ఆదివారం మీడియాతో మాట్లాడిన సచిన్ పైలట్.. '' కేబినెట్‌లోకి నలుగురు దళిత నేతల్ని చేర్చుకోనున్నారు. దళితులు, పేద వర్గాలకు కేబినెట్‌లో స్థానం కల్పించడం సంతోషకరం. ఈ నిర్ణయంతో ప్రజల్లోకి సానుకూల సంకేతాలు వెళతాయి. పలుసార్లు ఈ విషయాన్ని పార్టీ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఆ ప్రాధాన్యాన్ని పార్టీ పెద్దలు గుర్తించినందుకు సంతోషంగా ఉంది. ఇకపై కార్యకర్తలు, నాయకులు ఏకతాటిపై పనిచేస్తూ బీజేపీ వైఫల్యాలను ఎండగట్టాలని గడతాం. ఇటీవలే నేను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కలిశాను. గత 20 ఏళ్లుగా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను సమర్థంగా నిర్వర్తించాను. ఇకపై పార్టీ ఆదేశాల మేరకు ఎక్కడైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా. '' పేర్కొన్నారు.
ఆ వయస్సున్న అమ్మాయితో శృంగారం రేప్ కిందకే వస్తుంది..’’: మధ్యప్రదేశ్ కోర్టు తీర్పు
కేబినెట్ పునర్ వ్యవస్థీకకరణ నేపథ్యంలో పంజాబ్ సీఎం చరణ్‌జిత్ సింగ్ ఛన్ని (Punjab CM Charanjit Singh Channi) జైపూర్‌కు వెళ్లారు. సీఎం గహ్లోత్ (Ashok Gehlot) నివసంలో ఆయన్ను కలిశారు. ఇవాళ జరిగే ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన హాజరవుతారు.
#WATCH | Punjab CM Charanjit Singh Channi meets Rajasthan CM Ashok Gehlot in Jaipur.
(Source: Rajasthan CMO) pic.twitter.com/yCkGZwl73u
— ANI (@ANI) November 21, 2021
Covid-19: టీకా 2డోసులు పొందినా కరోనాకు బలి -వారంలో ఇద్దరు మృతి -ఏం జరిగిందంటే..
రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ప్రభుత్వంపై గత ఏడాది సచిన్ పైలట్ తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. యువ నేతలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఏకపక్షంగా ఆయన వ్యవహరిస్తున్నారని హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత సచిన్ పైలట్ బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన జ్యోతిరాదిత్య సింధియాకు ఇచ్చినట్లుగానే సచిన్ పైలట్‌కు కూడా బీజేపీ కీలక పదవి ఇస్తుందని ఊహాగానాలు వినిపించాయి. కానీ ఆయన ఖండిస్తూ వచ్చారు. సచిన్ పైలట్ అసంతృప్తిని కూడా హైకమాండ్ అర్ధం చేసుకుంది. అందుకే రాజస్థాన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయన వర్గం నేతకు ప్రాధాన్యత ఇచ్చారని సమాచారం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok gehlot, Rajasthan, Sachin Pilot