హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

ఇలాంటి చివరి కోరిక ఏ భార్య కోరదు... ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఏంచేశారంటే..

ఇలాంటి చివరి కోరిక ఏ భార్య కోరదు... ఆమె మృతదేహాన్ని కుటుంబ సభ్యులు ఏంచేశారంటే..

చనిపోయిన మహిళ

చనిపోయిన మహిళ

Rajasthan: మహిళ కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఈ క్రమంలో ఆమెను ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అయితే.. ఆమె తన భర్తతో చనిపోయిన తర్వాత తన మృతదేహాన్ని ఏంచేయాలో కూడా ముందే చెప్పింది.

  • Local18
  • Last Updated :
  • Rajasthan, India

సమాజంలో కొందరు ఉన్నతమైన ఆలోచనలు కల్గిఉంటారు. తాము ఉన్న లేకున్నా.. తమ వలన కొందరికైన మంచి జరగాలని భావిస్తుంటారు. అయితే.. మనం తరచుగా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు, బ్రెయిన్ డెడ్ అయిన వారి గురించి వింటునే ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో వారి శరీర అవయవాలను ఇతరులకు దానంగా ఇస్తుంటారు. దీంతో తాము చనిపోయిన వారి అవయవాలు చాలా మందికి ఉపయోగపడుతుంటాయి. మరికొందరు చనిపోయిన తమ మృతదేహాన్ని కాల్చేయకుండా ఏదైన మెడికల్ కాలేజీకి దానంగా కూడా ఇస్తుంటారు. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తివివరాలు.. రాజస్థాన్ లోని (Rajasthan)  భిల్వారాలో భూపాల్ సింగ్ రాథోడ్ భార్య కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుంది. ఈ క్రమంలో ఆమె తన భర్తదగ్గర 2019 ఒక మాట తీసుకుంది. తాను.. చనిపోతే మృతదేహాన్ని దహనం చేయకుండా... మెడికల్ కాలేజీకి ఇవ్వాలని కూడా చెప్పింది. ఇదే తన చివరి కోరిక అని తన భర్తతో మాట్లాడింది.

అయితే.. ఆతర్వాత తాజాగా, ఆమె నవంబరు 25 న ఆస్పత్రిలో కన్నుమూసింది. దీంతో ఆమె భర్త భూపాల్ సింగ్ రాథోడ్ ఆమె మృతదేహాన్ని.. భార్య చివరి కోరిక మేరకు విజయ్ రాజే సింధియా మెడికల్ కాలేజీకి అప్పగించాడు. భార్య మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించిన తర్వాత, భూపాల్ సింగ్ రాథోడ్ కూడా మృతదేహాన్ని దానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. శరీర దానం కంటే పెద్ద దానం లేదని భూపాల్ సింగ్ అన్నారు.

వామ్మో.. ఇంత లావా?.. ప్రయాణికురాల్ని నిషేధించిన విమాన సంస్థ

అందుకే, నా భార్య స్ఫూర్తితో నేను కూడా శరీరదానం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను. సామాజిక కార్యకర్త విక్రమ్ మాట్లాడుతూ మానవాళి సంక్షేమానికి శరీర దానం ముఖ్యపాత్ర పోషిస్తుందని, రాథోడ్ కుటుంబం ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాథోడ్ కుటుంబం యొక్క ఈ చొరవతో, సమాజంలో ఎక్కువ మంది వ్యక్తులు శరీర దానానికి ప్రేరణ పొందుతారు.

First published:

Tags: Rajasthan