హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

‘నా చేతుల్లో ఏమీలేదు.. ’.. కాంగ్రెస్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్..

‘నా చేతుల్లో ఏమీలేదు.. ’.. కాంగ్రెస్ సంక్షోభంపై కీలక వ్యాఖ్యలు చేసిన అశోక్ గెహ్లాట్..

అశోక్ గెహ్లాట్ (ఫైల్)

అశోక్ గెహ్లాట్ (ఫైల్)

Rajasthan:  రాజస్థాన్ కాంగ్రెస్ కు చెందిన 90 మందికి పైగా ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో ఈ ఘటన కాంగ్రెస్ లో రాజకీయాల్లో తీవ్ర దుమారంగా మారింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Rajasthan, India

రాజస్థాన్ లోని (Rajasthan)  90 మందికి పైగా ఎమ్మెల్యేలు స్పీకర్ ను కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా దీనిపై అశోక్ గెహ్లాట్ స్పందించారు. తనకు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాత్రికి రాజీనామా చేస్తామని బెదిరించడంతో, అది తన చేతుల్లో లేదని అశోక్ గెహ్లాట్ పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పినట్లు సమాచారం.

ఎమ్మెల్యేలు స్పీకర్‌తో సమావేశమై అశోక్ గెహ్లాట్ (Ashok Gehlot)  ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను ముఖ్యమంత్రిని చేస్తే తాము రాజీనామా చేస్తామని ప్రకటించారు. మిస్టర్ గెహ్లాట్ నాయకత్వానికి సన్నిహితుడైన కాంగ్రెస్ నాయకుడు కెసి వేణుగోపాల్‌తో ఫోన్‌లో మాట్లాడి, "నా చేతుల్లో ఏమీ లేదని చెప్పినట్లు వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలు సచిన్ పైలట్‌కు బదులుగా మిస్టర్ గెహ్లాట్ లేదా ఆయన సూచించిన వ్యక్తిని ఎంపిక చేసి ముఖ్యమంత్రిగా చేయాలని కోరుతున్నారు.

రాజస్తాన్(Rajasthan) లో రాజకీయ పరిణామాలు మళ్లీ రసవత్తరంగా మారాయి. అక్టోబర్‌ 17వ తేదీన కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి నిర్వహిస్తున్న ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి(Rajasthan CM)అశోక్ గెహ్లాట్(Ashok Gehlot)ప్రకటించిన విషయం తెలిసిందే. తాను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైతే రాజస్తాన్ సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాజస్తాన్ వ్యవహారాల బాధ్యుడు అజయ్ మాకెన్ నిర్ణయిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్​ పార్టీ కొన్ని నెలల క్రితం ఉదయ్​పుర్ డిక్లరేషన్​లో ఒక వ్యక్తి- ఒకే పదవి((One man-One post)లో ఉండాలని తీర్మానించింది.

గెహ్లాట్ పార్టీ అధ్యక్షుడిగా గెలుపొందితే తన ముఖ్యమంత్రి పదవిని వీడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో గెహ్లట్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిస్తే రాజస్తాన్ సీఎం పదవికి రాజీనామా చేయక తప్పదు. అశోక్ గెహ్లాట్ సీఎం పదవి నుంచి వైదొలగితే సచిన్ పైలట్(Sachin Pilot) రాజస్తాన్ సీఎం అవడానికి మార్గం సుగమం అవుతుందని నిన్నటివరకు అందరూ భావించారు. అయితే పైలట్ సీఎం అవడం అంత ఈజీగా ఉండదని ఈ రోజు రాజస్తాన్ లో జరిగిన పరిణామాలు సృష్టం చేస్తున్నాయి.

2020లో సచిన్ పైలట్..తన వర్గంగా ముద్రపడిన 18 మంది ఎమ్మెల్యేలతో సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో రాజస్తాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన 102 మంది ఎమ్మెల్యేలలో ఒకరిని ముఖ్యమంత్రి చేయాలని అశోక్ గెహ్లాట్ టీమ్‌కు చెందిన 56 మంది ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా నిర్ణయించుకున్నారని సమాచారం. తదుపరి సీఎం పేరు ప్రకటన కోసం సమావేశమవబోయే కీలకమైన లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ముందు ఇవాళ 16 మంది మంత్రులతో సహా గెహ్లాట్ వర్గం ఎమ్మెల్యేలు ఆదివారం సాయంత్రం జైపూర్ లోని ఎమ్మెల్యే శాంతి ధరివాల్ ఇంటిలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి హాజరైన స్వతంత్ర ఎమ్మెల్యే సన్యామ్ లోధా మీడియాతో మాట్లాడుతూ..."ఎమ్మెల్యేల కోరిక మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకోకపోతే, ప్రభుత్వం ఎలా నడుస్తుంది? ప్రభుత్వం పడిపోతుంది" అని అన్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Ashok gehlot, Congress, Rajasthan

ఉత్తమ కథలు