హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

OMG: తగ్గేదెలా.. 23 ఏళ్లుగా మీసాలు పెంచుకుంటున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా..?

OMG: తగ్గేదెలా.. 23 ఏళ్లుగా మీసాలు పెంచుకుంటున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా..?

ధన్నాలాల్ (ఫైల్)

ధన్నాలాల్ (ఫైల్)

Rajasthan: ధన్నాలాల్ గుర్జార్ 2003 నుండి మీసాలు పెంచుకుంటున్నాడు. ఇప్పుడు అతని మీసాలు చాలా పెద్దవిగా మారాయి, దానిని ఉంచడానికి, అతను తన చొక్కాలో ప్రత్యేకంగా.. ఒకటిన్నర అడుగుల జేబును పెట్టించాడు. ధన్నాల రోజూ రెండు గంటల పాటు మీసాలు నున్నగా ఉండేందుకు మెలిపేవాడు.

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Rajasthan, India

మనలో చాలా మందికి ఏదో రకంగా ఫెమస్ అవ్వాలనుంటుంది. దీని కోసం నానా అవస్థలు పడుతుంటారు. కొంత మంది పెయింటింగ్ వేయడం, పాటలు, ఆటలు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొదానిలో తమకంటూ ప్రత్యేకమైన ట్యాలెంట్ ను కల్గి ఉంటారు. మరికొంందరు వెంట్రుకలను పెంచుతారు. గోర్లను కూడాపెంచుకొవడానికి ఆసక్తి చూపిస్తుంటారు. ఇక్కడ ఒక వ్యక్తి తన మీసాలను కొన్ని ఏళ్లపాటు పెంచి ప్రస్తుతం వార్తలలో నిలిచాడు.

పూర్తి వివరాలు.. రాజస్థాన్ (Rajasthan) లోని కోటాలో ధన్నాలాల్ గుర్జార్ అనే వ్యక్తి ఉంటున్నాడు. అతను.. అమితాబ్ బచ్చన్ అంటే ఎంతో ఇష్టం. అందుకే ఆయన డైలాగ్ లను అందరి ముందు చెప్తుంటాడు. అదే విధంగా కొన్ని సినిమాలలో మీసాలు పెంచుకున్నారు. అయితే.. ధన్నాలాల్ దీన్ని ఫాలో అవ్వడం మొదలు పెట్టాడు. దాదాపు 23 ఏళ్లుగా మీసాలు తీయకుండా అట్లానే పెంచుకుంటున్నాడు.

అతను.. మీసాల పోటీలలో కూడా పాల్గొన్నాడు. కోట ఫెస్టివల్ మీసాల పోటీలో వచ్చిన ధన్నా లాల్ గుర్జర్ మీసాలు ఒక వైపు నుండి నాలుగున్నర అడుగుల పొడవు, మీసాల పొడవు మోకాళ్ల క్రింద ఉంటుంది. దాదాపు ప్రతిరోజు 2 గంటల పాటు మీసాలను దువ్వెనతో దూస్తుంటాడు. అంతే కాకుండా.. మీసాలను సురక్షితంగా ఉంచడానికి, చొక్కాలో ఒకటిన్నర అడుగుల ప్రత్యేక పాకెట్ తయారు చేయబడింది. ధన్నా లాల్ మీసాల కోసం చాలా పోటీలలో గెలుపొందారు. హదౌతిలో ధన్నాలాల్‌కు ఉన్నంత మీసాలు మరెవరికీ లేవు.

2003 నుంచి మీసాలు పెంచుతున్నట్లు ధన్నా లాల్ తెలిపారు. పూర్వం చెవులకు చుట్టుకునేవారు. పొడవు పెరగడం వల్ల వాటిని నిలబెట్టుకోవడం కష్టంగా మారింది. అందుకే చొక్కా లోపల ఒకటిన్నర అడుగుల పాకెట్ తయారు చేయబడింది. ఈ చొక్కా జేబులో, అతను తన ఛాతీపై చిన్నపిల్లలా మీసాలు ఉంచాడు. ధన్నాలాల్ గుర్జార్ తన మీసాలపై రోజూ గేదె పాల నురుగును పూస్తానని చెప్పాడు. ఆరిన తర్వాత సబ్బుతో కడిగి, తర్వాత ఆవాల నూనె రాస్తానని తెలిపాడు. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి రోజుకు సుమారు 2 గంటలు పడుతుందని ధన్నలాల్ పేర్కొన్నాడు.

23 ఏళ్లుగా మీసాలు కత్తిరించలేదు

2000 సంవత్సరంలో చివరిసారిగా మీసాలకు కత్తెర వేశానని ధన్నాలాల్ చెప్పాడు. ఆ తర్వాత 23 ఏళ్ల పాటు మీసాలు కత్తిరించలేదు. అతని కుటుంబంలో అందరికీ పొడవాటి మీసాలు ఉంటాయి. ధన్నాలాల్ కూడా తన మీసాలు పొడవుగా ఉంచాలని నిర్ణయించుకున్నాడు. ప్రస్తుతం ఈ మీసాలతో ధన్నాలాల్ మాత్రం వార్తలలో నిలిచాడు.

First published:

Tags: Rajasthan, VIRAL NEWS

ఉత్తమ కథలు