రాజస్తాన్‌లో తీవ్ర విషాదం.. ఊపిరాడక ఐదుగురు పిల్లలు మృతి..

ఐదుగురు పిల్లలు మృతిచెందడంతో విషాదంలో గ్రామస్తులు(Image-ANI)

ఊపిరాడక ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటన రాజస్తాన్‌లోని బికనేర్ జిల్లాలో చోటుచేసుకుంది.

 • Share this:
  రాజస్థాన్‌లో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఊపిరాడక ఐదుగురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు ఆడుకుంటున్న సమయంలో ధాన్యం నిల్వచేసే కంటైనర్‌లోకి దూకడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతిచెందిన పిల్లలు 3 నుంచి 8 ఏళ్ల మధ్య వారేనని పోలీసులు తెలిపారు. పిల్లలంతా ఒకే కుంటుబానికి చెందినవారు కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. బికనేర్ జిల్లాలోని హిమ్మత్‌సార్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంటైనర్ పూర్తిగా ఖాళీగా ఉంది. ఆదివారం ఆ ప్రాంతంలో ఆడుకుంటున్న పిల్లలు.. కంటైనర్ ఒకరి తర్వాత ఒకరు దూకారు. పిల్లలు అందులోకి వెళ్లాక ప్రమాదవశాత్తు కంటైనర్ లాక్ అయిపోయింది. దీంతో పిల్లలు అందులోనే చిక్కుకుపోయారు.ఈ క్రమంలోనే పిల్లలు ఊపిరాడక చనిపోయారు.

  ఇక, బయటకు వెళ్లి తిరిగివచ్చిన పిల్లల తల్లి.. ఇంట్లో వెతకగా వారు కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన చుట్టుపక్కల వెతకసాగింది. ఈ క్రమంలోనే కంటైనర్ ఓపెన్ చేయడంతో అందులో పిల్లలు పడిపోయి ఉండటం గుర్తించింది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే పిల్లలు మృతిచెందినట్టుగా వైద్యులు నిర్ధారించారు. ఇక, చనిపోయినవారిలో నలుగురు ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు ఉన్నాడు. వారిని సేవారామ్(4), రవీనా(7), రాధ(5), పూనమ్(8), మాలిలుగా గుర్తించారు.

  షాకింగ్.. హాస్పిటల్‌లో హస్తప్రయోగం.. మహిళ వెనకాలే నిల్చుని పాడుపని

  ఒకే కుటుంబంలోని ఐదుగురు పిల్లల ప్రాణాలు పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనతో గ్రామంలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇక, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
  Published by:Sumanth Kanukula
  First published: