Tiger Attack : టూరిస్ట్‌ బస్‌ను వెంటాడిన పులి... హడలెత్తిన పర్యాటకులు

Raipur Nandanvan Jungle Safari : జంగిల్ సఫారీలో పులుల జోలికి పర్యాటకులు వెళ్లకూడదు. అలా వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహించారు.

news18-telugu
Updated: February 17, 2020, 2:26 PM IST
Tiger Attack : టూరిస్ట్‌ బస్‌ను వెంటాడిన పులి... హడలెత్తిన పర్యాటకులు
Tiger Attack : టూరిస్ట్‌ బస్‌ను వెంటాడిన పులి... హడలెత్తిన పర్యాటకులు
  • Share this:
Raipur Nandanvan Jungle Safari : ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌ నందన్‌వన్‌ జంగిల్‌ సఫారికి చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఓ పర్యాటకుల బస్‌ను పులి వెంటాడిన దృశ్యం ఈ వీడియోలో ఉంది. ఐతే... ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు సఫారీ పార్క్ సిబ్బందిని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. భద్రతా చర్యల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై వేటు వేసింది. అసలేం జరిగిందంటే... ఈ జంగిల్ సఫారీలో టూరిస్టులను బస్సు ఎక్కించారు. సఫారీకి తీసుకెళ్లారు. పులులు ఎప్పుడు కనిపిస్తాయా, వాటిని ఎప్పుడు వీడియోలు, ఫొటోలూ తీసుకుందామా అని పర్యాటకులు ఎదురుచూస్తున్నారు. బస్సు... సఫారీ లోపలికి వెళ్లింది. అక్కడ రెండు పులులు దెబ్బలాడుకుంటూ కనిపించాయి. వెంటనే టూరిస్టులు... ఆ పులుల దగ్గరకు బస్సును తీసుకెళ్లమని డిమాండ్ చేశారు. అలా తీసుకెళ్తేనే తాము వాటిని క్లియర్‌గా చూడగలమనీ, వాటిని స్పష్టంగా వీడియో తియ్యగలం అని అన్నారు. ఐతే... రూల్స్ ప్రకారం సిబ్బంది బస్సును పులుల దగ్గర దాకా తీసుకెళ్లకూడదు. అక్కడ అలాంటి కొన్ని రూల్స్ ఉన్నాయి. కానీ పర్యాటకులు అడిగారని అక్కడి దాకా తీసుకెళ్లారు. ఆ తర్వాత పరిస్థితి కంట్రోల్ తప్పింది.


బస్సు దగ్గరకు రాగానే పులులు దెబ్బలాడుకోవడం మానేశాయి. రెండు పులుల్లో ఒకటి... బస్సు కిటికీకి ఉన్న కర్టెన్‌ను లాగేందుకు ప్రయత్నించింది. బస్‌పై దాడికి పులి యత్నించడంతో బస్‌ను వేగంగా నడపాలని ఓ టూరిస్టు... డ్రైవర్‌ను కోరాడు. అలా చేస్తే పులి దంతాలు, దవడలకు గాయాలవుతాయి. అది తెలిసి కూడా... డ్రైవర్ బస్సును ముందుకు కదిలించాడు. అలా చేస్తే పులి... బస్సు కర్టెన్‌ను వదిలేస్తుంది అనుకున్నాడు. కానీ పులి చాలా కోపంగా ఉండటంతో... అది కర్టెన్‌ను వదలకుండా పట్టుకుంది. బస్సుతోపాటూ అది కూడా ముందుకు దూసుకెళ్లింది.




ఎంతకీ పులి వదలకపోవడంతో... బస్సులో పర్యాటకులు బెంబేలెత్తిపోయారు. అరుపులు, కేకలు పెట్టారు. పులి తమను తినేస్తుందేమో అని భయపడ్డారు. ఇలా కాసేపు జరిగిన తర్వాత పులి కాస్త పట్టు తప్పగానే... బస్సును వేగంగా నడిపి... టూరిస్టుల ప్రాణాలు కాపాడారు. దీనంతటికీ కారణం బస్‌ డ్రైవర్‌, టూరిస్ట్‌ గైడే కావడంతో... వాళ్లను విధుల నుంచి తొలగించారు ఉన్నతాధికారులు. ఐతే... ఇప్పుడీ వీడియో వైరల్ అయ్యింది. అంతా దీన్ని చూసి... అమ్మో పులితో పెట్టుకుంటే డేంజరే అంటున్నారు.
First published: February 17, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు