HOME »NEWS »NATIONAL »railways to start 200 non ac special passenger trains daily from june 1 sk

జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు ప్రారంభం.. రైల్వేశాఖ ప్రకటన

జూన్ 1 నుంచి సాధారణ రైళ్లు ప్రారంభం.. రైల్వేశాఖ ప్రకటన
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది.

  • Share this:
    లాక్‌డౌన్ 4లో కేంద్ర ప్రభుత్వం చాలా సడలింపులు ఇచ్చింది. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ప్రజా రవాణాకు అనుమతిచ్చాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో బస్సులు, కార్లు, ఆటోలు రోడ్డెక్కాయి. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ సైతం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి సమయానుకూలంగా రోజుకు 200 రైళ్లను నడుపుతామని ప్రకటించింది. త్వరలోనే రైళ్లకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ముందస్తు రిజర్వేషన్‌ చేయించుకున్న వారికి మాత్రమే రైలు ప్రయాణానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. కౌంటర్ల ద్వారా టికెట్‌ బుకింగ్‌ చేసుకునే వెసులుబాటు ఉండదని తెలిపింది. ఐతే ప్రస్తుతానికి నాన్‌ ఏసీ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ వెల్లడించింది. ఇప్పటికే వలస కార్మికుల కోసం రైళ్లను నడుపుతున్న కేంద్రం.. వాటికి అదనంగా మరో 200 సాధారణ రైళ్లను నడుపుతున్నట్లు స్పష్టం చేసింది.
    Published by:Shiva Kumar Addula
    First published:May 19, 2020, 22:27 IST

    टॉप स्टोरीज