Indian Railways: అప్పటి వరకు అన్ని రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు

ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని రూట్లలో రాకపోకలు సాగిస్తున్న 230 కోవిడ్ స్పెషల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది.

news18-telugu
Updated: August 11, 2020, 10:49 PM IST
Indian Railways: అప్పటి వరకు అన్ని రెగ్యులర్ ప్యాసింజర్ రైళ్లు రద్దు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా నేపథ్యంలో మార్చి నుంచి దేశవ్యాప్తంగా రైళ్లు తిరగడం లేదు. పలు రూట్లలో నడిచే స్పెషల్ రైళ్లు తప్ప మిగతా వాటికి కేంద్రం అనుమతివ్వలేదు. ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్యాసింజర్ రైళ్ల రద్దును రైల్వేశాఖ మరో్సారి పొడిగించింది. తదుపరి ప్రకటన వరకు సాధారణ ప్రయాణికుల రైళ్లు, సబ్ అర్బన్ రైళ్ల రాకపోకలపై నిషేధం ఉంటుందని స్పష్టం చేసింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో కొన్ని రూట్లలో రాకపోకలు సాగిస్తున్న 230 కోవిడ్ స్పెషల్ రైళ్లు మాత్రం యథావిధిగా నడుస్తాయని వెల్లడించింది.

కరోనా లాక్‌డౌన్ వల్ల రైల్వేశాఖపై తీవ్ర ప్రభావం పడింది. రూ.35వేల కోట్ల నష్టం వచ్చినట్లు రైల్వేశాఖ అంచనా వేస్తోంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 2,268,675 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాను జయించి 1,583,489 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇప్పటి వరకు 45,257 మంది మరణించగా.. ప్రస్తుతం మన దేశంలో 639,929 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.
Published by: Shiva Kumar Addula
First published: August 11, 2020, 10:47 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading