IRCTC: గుడ్ ‌న్యూస్.. ఆ రైళ్లలో టికెట్ ధరలు భారీగా తగ్గింపు

2016 డిసెంబరులో రైల్వేశాఖ హమ్‌సఫర్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 హమ్‌సఫర్ రైళ్లు నడుస్తున్నాయి.

news18-telugu
Updated: September 13, 2019, 8:25 PM IST
IRCTC: గుడ్ ‌న్యూస్.. ఆ రైళ్లలో టికెట్ ధరలు భారీగా తగ్గింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైల్వే ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. ఏసీ బోగీలతో అధునాతన సౌకర్యాలున్న హమ్‌సఫర్ రైళ్ల టికెట్ ధరలను భారీగా తగ్గిస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ప్రీమియమ్ హమ్‌సఫర్ రైళ్లలో ఫ్లెక్సీ విధానాన్ని రద్దు చేసింది. అంతేకాదు కేవలం థర్డ్ క్లాస్ ఏసీ కోచ్‌లున్న ఈ రైళ్లలో స్లీపర్ క్లాస్ కోచ్‌లను కూడా అందుబాటులోకి తెస్తామని అధికారులు వెల్లడించారు. అత్యున్నత ప్రమాణాలు కలిగిన సదుపాయాలను తక్కువ ధరకే ప్రయాణికులకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం హమ్‌సఫర్ రైళ్లలో ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉంది. 50శాతం సీట్లను సాధారణ పద్దతిలో అమ్మి.. మిగతా 50 సీట్లను బెర్తులు నిండేకొద్దీ చార్జీలు పెంచే విధానంలో కేటాయించేవారు. ఇకపై ఆ విధానం ఉండదు. ఒకే ధర ఉండేలా ఫిక్స్‌డ్ ఫేర్ విధానాన్ని అమలు చేస్తారు.

అంతేకాదు తత్కాల్ టికెట్ల ధరలను కూడా తగ్గించారు. ఇంతకు ముందు బేస్ ధర కంటే 1.5 రెట్లు అధికంగా తత్కాల్ టికెట్ల రేట్లు ఉండేవి. దాన్ని 1.3 రెట్లకు తగ్గించారు. ఇక ఫస్ట్ చార్టింగ్ పూర్తయ్యాక కరెంట్ బుకింగ్ ద్వారా అమ్మే టికెట్లను 10శాతం తక్కువ ధరకే అమ్ముతారు.

2016 డిసెంబరులో రైల్వేశాఖ హమ్‌సఫర్ రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 70 హమ్‌సఫర్ రైళ్లు నడుస్తున్నాయి. ఐతే ధరలు ఎక్కువగా ఉండడంతో పాటు బెర్తులు నిండేకొద్దీ టికెట్ల ధరలు పెరిగే ఫ్లెక్సీ ఫేర్ విధానం ఉండడంతో ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే హమ్‌సఫర్ టికెట్ల ధరలను తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.


First published: September 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading