రైల్వే ప్రయాణికులకు చార్జీల వడ్డెన..కొత్త సంవత్సరం కొంత భారంగా...

ఈ పెరిగిన ధరలు ఈ రోజు రాత్రి నుంచే అమలులోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. సెకండరీ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీలో కిలోమీటరకు ఒక పైసా చొప్పున పెంచింది.

news18-telugu
Updated: December 31, 2019, 9:08 PM IST
రైల్వే ప్రయాణికులకు చార్జీల వడ్డెన..కొత్త సంవత్సరం కొంత భారంగా...
హౌరా-యశ్వంతపూర్ జంక్షన్ మధ్య వారంలో 5 రోజులు దురంతో ఎక్స్‌ప్రెస్ నడిపిస్తారు. మంగళ, బుధ, శుక్ర, శని, ఆదివారాల్లో దురంతో ఎక్స్ ప్రెస్ నడవనుంది. వీటితో పాటు మరికొన్ని రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లనున్నాయి.
  • Share this:
రైల్వే శాఖ ప్రయాణికుల ఛార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ పెరిగిన ధరలు ఈ రోజు రాత్రి నుంచే అమలులోకి వస్తాయని రైల్వే శాఖ ప్రకటించింది. సెకండరీ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ ఆర్డినరీలో కిలోమీటరకు ఒక పైసా చొప్పున పెంచింది. అలాగే సెకండరీ క్లాస్, స్లీపర్ క్లాస్, ఫస్ట్ క్లాస్ మెయిల్-ఎక్స్‌ప్రెస్‌ల్లో రెండు పైసల చొప్పున పెంచింది. అలాగే ఏసీ చైర్ కార్, ఏసీ 3టైర్, ఏసీ 3ఈ, ఏసీ 2టైర్, ఏసీ ఫస్ట్ క్లాస్, ఏసీ ఈసీ లాంటి ఏసీల్లో నాలుగు పైసల చొప్పున పెంచారు. జనవరి 1 అర్థరాత్రి నుంచే నూతన రేట్లను టికెట్‌పై వసూలు చేయనున్నారు.
Published by: Krishna Adithya
First published: December 31, 2019, 9:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading