Indian Railways : చైనా, జపాన్‌లో గంటకు 500 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లున్నాయి. మన దేశంలో ప్యాసింజర్ రైళ్లైతే... ఎంత సేపైనా అలా వెళ్తూనే ఉంటాయి తప్ప గమస్థాన రాదన్న విమర్శలకు చెక్ పెడుతూ... రైల్వే శాఖ వాటి యావరేజ్ స్పీడ్‌ను... 30 శాతం పెంచుతూ... గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా చెయ్యబోతోంది. అలాగే... ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా రూట్లలో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో రైళ్లు వెళ్లేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది చాలా మంచి నిర్ణయం అనుకోవచ్చు. ఎందుకంటే... మనం ఓ ప్యాసింజర్ రైలు ఎక్కినప్పుడు అది గమ్య స్థానానికి 10 గంటల తర్వాత చేరుతుందని అనుకుంటే... వేగం పెంచిన తర్వాత అది... 7గంటల్లోనే చేరుతుంది. అంటే మూడు గంటలు ఆదా ఆయినట్లే. ఆ ట్రైన్లో ప్రయాణించిన వేల మందికి మూడేసి గంటల చొప్పిన టైమ్ సేవ్ అయినట్లే. ఇలా దేశవ్యాప్తంగా రోజూ కొన్ని లక్షల మంది రైల్వే ప్రయాణికుల టైమ్ సేవయ్యే ఛాన్స్ ఉంది. ఇది దేశ అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుంది.
సరుకులు మోసుకెళ్లే రైళ్ల వేగాన్ని ఏకంగా 80 శాతం పెంచాలనుకుంటోంది రైల్వే శాఖ. ఐతే... ఇదంతా ఇప్పుడే జరిగిపోదు. వచ్చే ఐదేళ్లలోపు ఇలా చెయ్యాలని అజెండా పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన ప్లాన్‌ను గత వారం ప్రధాని నరేంద్రమోదీతోపాటూ... మంత్రివర్గానికి ప్రజెంటేషన్ రూపంలో చూపించగా... అందరూ శభాష్ అన్నారు. ఇటీవల రైల్వేకి సరుకుల రవాణా తగ్గిపోతూ... రోడ్డు రవాణాకి సరుకుల రవాణా పెరుగుతోంది. అందుకే యావరేజ్ స్పీడ్‌ను పెంచాలని రైల్వే శాఖ భావించింది. ప్రస్తుతం గూడ్స్ రైళ్లు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నాయి. 2024కి ఇవి గంటకు 45 కిలోమీటర్ల వేగంతో వెళ్లనున్నాయి.
రెడ్డి- వెలమలకు బలుపు... ఎమ్మెల్యే శంకర్‌నాయక్ షాకింగ్ కామెంట్స్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Breaking news, India news, National News, News online, News today, News updates, Telugu news, Telugu varthalu