109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లు.. ప్రైవేట్ సంస్థలకు రైల్వేశాఖ ఆహ్వానం

మొత్తం 12 క్లస్టర్లలో 109 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు అనుమతిచ్చింది కేంద్రం. దీని ద్వారా రైల్వేశాఖలో రూ.30వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది.

news18-telugu
Updated: July 1, 2020, 8:52 PM IST
109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లు.. ప్రైవేట్ సంస్థలకు రైల్వేశాఖ ఆహ్వానం
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
రైల్వే ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో కీలక అడుగు ముందుకేసింది. రైల్వేల్లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ సంస్థలను ఆహ్వానించింది. మొత్తం 109 రూట్లలో ప్రైవేట్ ప్యాసింజర్ రైళ్లకు అనుమతిచ్చింది కేంద్రం. ఈ మేరకు రైల్వేల్లో ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యం కోసం రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్ (RFQ)కు ఆహ్వానించింది. భారతీయ రైల్వే నెట్‌వర్క్ పరిధిలోని  మొత్తం 12 క్లస్టర్లలో 109 రూట్లలో ప్రైవేట్ రైళ్లకు అనుమతిచ్చింది కేంద్రం. దీని ద్వారా రైల్వేశాఖలోకి రూ.30వేల కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తోంది.

109 రూట్లో మొత్తం 151 అధునాతన రైళ్లు నడుస్తాయి. ఒక్కో రైలుకు 16 కోచ్‌లు ఉంటాయి. రైళ్లు గరిష్టంగా గంటకు 160 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఆయా ప్రైవేట్ సంస్థలు రైల్వేశాఖకు రవాణా చార్జీలు, విద్యుత్ చార్జీలు, గ్రాస్ రెవెన్యూలో వాటా చెల్లించాల్సి ఉంటుంది. వాటికి 35 ఏళ్ల పాటు ప్రభుత్వ రాయితీలు అందుతాయి. ఇక ఈ ప్రైవేట్ రైళ్లలోనూ భారతీయ రైల్వేకు చెందిన లోకో పైలట్, గార్డ్ విధులు నిర్వహిస్తారు. రైళ్ల నిర్వహణతో పాటు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ఉపాధి కల్పన, ప్రయాణికుల భద్రత, ప్రయాణికులకు అంతర్జాతీయ ప్రమాణాలతో రైలు ప్రయాణ అనుభూతి కలిగించాలన్న ఉద్దేశంతోనే రైల్వేలోకి ప్రైవేట్ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.
First published: July 1, 2020, 8:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading