Special Trains: ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువు పెంపు

ప్రత్యేక రైళ్లలో పార్శిల్స్‌, లగేజీ బుకింగ్‌లను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు మే 31 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.

news18-telugu
Updated: May 28, 2020, 9:59 PM IST
Special Trains: ప్రత్యేక రైళ్లలో ముందస్తు రిజర్వేషన్ గడువు పెంపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ప్రత్యేక రైళ్లలో ముందుస్తు రిజర్వేషన్ గడువును రైల్వేశాఖ పెంచింది. ముందస్తు రిజర్వేషన్‌ గడువు ఇప్పటి వరకు 30 రోజులు ఉండగా.. దానిని 120 రోజులకు పెంచింది. ఈ మేరకు గురువారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. 30 ప్రత్యేక రాజధాని తరహా రైళ్లు, 200 ప్రత్యేక మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతో పాటు జూన్‌ 1 నుంచి నడిచే 200 ప్రత్యేక రైళ్లకూ ఇది వర్తిస్తుందని తెలిపింది. ఈ రైళ్లలో పార్శిల్స్‌, లగేజీ బుకింగ్‌లను కూడా అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిబంధనలు మే 31 నుంచి అమల్లోకి వస్తాయని రైల్వేశాఖ వెల్లడించింది.


కాగా, జూన్ 1 నుంచి 200 రైళ్ల (100 జతలు) నడవనున్న విషయం తెలిసిందే. ఈ రైళ్లకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఈ నెల 21 నుంచే ప్రారంభమయ్యాయి. ఈ రైళ్లలో ఏసీ, నాన్ ఏసీ బోగీలు కూడా ఉంటాయి. ఐతే జనరల్ బోగీలకు కూడా టికెట్లను ఆన్‌లైన్‌లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. జనరల్ కోచ్‌లోనూ సెకండ్ సీటింగ్ (2s) చార్జీలను వసూలు చేస్తారు. ఈ రైళ్ల బుకింగ్స్‌లో RAC, వెయిటింగ్ లిస్ట్ కూడా ఉటుంది. ఐతే వెయిటింగ్ లిస్ట్ టికెట్ కలిగిన వారిని రైళ్లలోకి అనుమతించరు. రైలు ప్రయాణికులంతా కేంద్రవైద్యఆరోగ్యశాఖ విడుదల చేసిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ (SOP)ని పాటించాల్సి ఉంటుంది.
First published: May 28, 2020, 9:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading