• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • RAILWAYS GREEN SIGNAL TO RE OPEN RESERVATION COUNTERS AT STATIONS FROM TOMORROW BA

రైల్వే స్టేషన్లలో రేపటి నుంచి టికెట్ బుకింగ్ కౌంటర్లు ఓపెన్...

రైల్వే స్టేషన్లలో రేపటి నుంచి టికెట్ బుకింగ్ కౌంటర్లు ఓపెన్...

ప్రతీకాత్మక చిత్రం

రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను రేపటి నుంచి తెరుస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లలో టికెట్ బుకింగ్ కౌంటర్లను రేపటి నుంచి తెరుస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా ప్రయాణికుల రైల్వే సేవలు నిలిచిపోయాయి.గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ క్రమంలో సుమారు రెండు నెలల తర్వాత దేశవ్యాప్తంగా మళ్లీ రైల్వే టికెట్ కౌంటర్లు ఓపెన్ కానున్నాయి. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్లను ఓపెన్ చేయాల్సిందిగా జోనల్ రైల్వేలకు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. అయితే, అన్నీ ఒకేసారి కాకుండా, దశలవారీగా తెరుచుకోనున్నాయి. కొన్ని రోజుల క్రితం వలస కార్మికుల కోసం శ్రామిక్ స్పెషల్ రైళ్లను రైల్వే శాఖ ప్రకటించింది. ఆ తర్వాత సాధారణ ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను తీసుకొచ్చింది. అందులో టికెట్ బుకింగ్ మొత్తం IRCTC ద్వారానే జరుగుతోంది. ప్రభుత్వం పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా టికెట్లు జారీ చేస్తున్నారు. జూన్ 1 నుంచి 200 రైళ్లను నడుపుతున్నట్టు ప్రకటించిన రైల్వే శాఖ దానికి కూడా IRCTC ద్వారానే టికెట్ బుకింగ్ జారీ చేసింది. అందులో 73 రైళ్లకు టికెట్ల కోసం ప్రయాణికులు ఎగబడ్డారు. కేవలం రెండు గంటల వ్యవధిలోనే 1.5 లక్షల టికెట్లు అమ్ముడుపోయాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్లలోనే నేరుగా టికెట్ బుకింగ్ కౌంటర్లు తెరవనుండడంతో ప్రయాణికులకు మరింత ఊరట కలగనుంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు