శబరిమలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే

హైదరాబాద్-కొల్లాం సువిధ ప్రత్యేక రైలు (82721) నవంబర్ 25, 29న సాయంత్రం 3.55 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది. కొల్లాం-హైదరాబాద్ సువిధ ప్రత్యేక రైలు (82722) నవంబర్ 27, డిసెంబర్ 1న కొల్లాం జంక్షన్ నుంచి 3 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.

news18-telugu
Updated: November 24, 2018, 10:44 AM IST
శబరిమలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే
శబరిమలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన రైల్వే (Image: PTI)
news18-telugu
Updated: November 24, 2018, 10:44 AM IST
దీక్ష చేపట్టిన అయ్యప్ప భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ శనివారం రోజు ఈ శుభవార్త చెప్పారు. నవంబర్, డిసెంబర్, జనవరి మాసాల్లో రద్దీ దృష్ట్యా హైదరాబాద్-కొల్లాం, కొల్లాం-చెన్నై సెంట్రల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతున్నామని ఆయన ట్వీట్ చేశారు. ఈ రైళ్లకు ప్రత్యేక ఛార్జీలు ఉంటాయి.

శబరిమలకు ప్రత్యేక రైళ్ల వివరాలివే...
డిసెంబర్ 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31, జనవరి 2, 7, 9, 14న చెన్నై సెంట్రల్ నుంచి రాత్రి 8.40 గంటలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం కొల్లాం చేరుకుంటుంది. డిసెంబర్ 4, 6, 11, 13, 18, 20, 27, జనవరి 3, 8, 10న కొల్లాం నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 9.45 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. అరక్కోణం, కట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఇరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పలక్కాడ్, ఒట్టపాలం, తిర్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెనగనస్సెరీ, తిరువల్ల, చెంగనూరు, మవేలికర, కాయంకులం స్టేషన్లలో ఈ ప్రత్యేక రైళ్లు ఆగుతాయి.

కొల్లాం-హైదరాబాద్ మధ్య సువిధ రైళ్లు: హైదరాబాద్-కొల్లాం సువిధ ప్రత్యేక రైలు (82721) నవంబర్ 25, 29న సాయంత్రం 3.55 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 11:55 గంటలకు కొల్లాం జంక్షన్‌కు చేరుకుంటుంది. కొల్లాం-హైదరాబాద్ సువిధ ప్రత్యేక రైలు (82722) నవంబర్ 27, డిసెంబర్ 1న కొల్లాం జంక్షన్ నుంచి 3 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.చెన్నై-కొల్లాం మధ్య సువిధ రైళ్లు: కొల్లాం-చెన్నై సెంట్రల్ సువిధ ప్రత్యేక రైలు(82634) డిసెంబర్ 25, జనవరి 1న కొల్లాం నుంచి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 9.45 గంటలకు చెన్నై సెంట్రల్‌కు చేరుకుంటుంది. చెన్నై సెంట్రల్-కొల్లాం సువిధ ప్రత్యేక రైలు (82635) జనవరి 11న రాత్రి 8.40 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం కొల్లాం చేరుకుంటుంది.

రైల్లో ప్రయాణించే అయ్యప్ప భక్తుల కోసం 182 ఆల్ ఇండియా సెక్యూరిటీ హెల్ప్‌లైన్ నెంబర్ అందుబాటులోకి వచ్చింది. ప్రయాణికుల కోసం బుకింగ్ ఆఫీసులు, రిజర్వేషన్ సెంటర్ల దగ్గర అదనపు కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. చెంగన్నూరు, కొట్టాయం దగ్గర రిజర్వేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పంబ దగ్గర ప్యాసింజర్ రిజర్వేషన్ కౌంటర్, కొల్లాంలో 24 గంటల రిజర్వేషన్ కౌంటర్ అందుబాటులోకి రానున్నాయి.

ఇవి కూడా చదవండి:
Loading...
షాపింగ్‌కు వెళ్తున్నారా? డబ్బు ఆదా చేసే 9 మార్గాలివే...

వాట్సప్‌లో కొత్త ఫీచర్... మీకు సమస్యలు తప్పవా?

రెడ్‌మీ నోట్ 6 ప్రో ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూశారా?

పేటీఎం కొత్త స్కీమ్... బ్యాంకు ఎఫ్‌డీ కన్నా ఎక్కువ లాభం

భార్యాభర్తలకు ప్రత్యేకం: ఈ 3 సెకండ్స్ ట్రిక్ తెలుసా?
First published: November 24, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...