రైల్వే స్టేషన్‌లో గానీ.. బయట గానీ.. రైలు పట్టాలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు రైలు వస్తుందో మనకు తెలియదు. అలాంటప్పుడు ఏమరపాటుగా ఉండి పట్టాలు ఎక్కితే.. ఏమైనా జరగొచ్చు. పట్టాలు దాటే సమయంలోనే.. రైలు రావొచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. ఐనా ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహిస్తున్నారు. ముంబైలోని కల్యాణ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వృద్ధుడు పట్టాలు దాటుతున్న సమయంలోనే రైలు దూసుకొచ్చింది. అక్కడే పనిచేస్తున్న ట్రాక్ సిబ్బంది, లోకో పైలట్ అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. వెంట్రుక వాసిలో ఆయన మృత్యువును తప్పించుకున్నాడు. కల్యాణ్ రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధుడు పట్టాలు దాటేందుకు ప్రయత్నించాడు. అదే సమయంలో ముంబై-వారణాసి ఎక్స్‌ప్రెస్ (02193) రైలు బయలుదేరింది. అప్పటికే కాస్త వేగం పుంజుకుంది. అంతలోనే ఓ వృద్ధుడు పట్టాలపైకి వచ్చాడు.
స్టేషన్‌లో పనిచేస్తున్న ట్రాక్ సిబ్బంది ఆయన్ను చూసి.. కేకలు వేశారు. లోక్‌పైలట్లను అప్రమత్తం చేశారు. వారు వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్‌ను అప్లై చేశారు. అయినప్పటికీ రైలు కొంత దూరం ముందుకు కదలి.. ఆ వృద్ధుడి వద్దు వచ్చి ఆగింది. అతడు ఇంజిన్ కింద భాగంలో ఉండే బంపర్ వద్ద ఇరుక్కుపోయాడు. రైల్వే సిబ్బంది వచ్చి క్షేమంగా బయటకు తీశారు. ఆ ఘటనను సెంట్రల్ రైల్వే తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Trespassing railway tracks is dangerous and illegal but still people take the risk. A senior citizen narrowly escaped death after a locomotive train in Mumbai's Kalyan area applied emergency brakes to save the man as he was crossing the tracks. pic.twitter.com/dWXND951SZ
— saurabh _shukla 542 (@shukla_sau542) July 18, 2021
ఆ వృద్ధుడు క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆయను స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. అంతకు మంచీ ఏమీ కాలేదు. ట్రాక్ సిబ్బంది చెప్పిన వెంటనే ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి.. వృద్ధుడిని కాపాడిన లోకో పైలట్లను రైల్వే అధికారులు అభినందించారు. ఇక రైల్వే స్టేషన్‌లో ఇలా ప్రమాదకరంగా ప్రమాదాలు దాటకూడదని ఆ వృద్ధుడికి సూచించారు. ప్రతి స్టేషన్‌లోనూ ఫుట్ఓవర్ బ్రిడ్జిలు లేదా ఎస్కలేటర్స్ ఉంటాయని ప్రజలు వాటి ద్వారానే వెళ్లాలని రైల్వే అధికారులు చెప్పారు. పట్టాలు దాటడం వల్ల ప్రాణాలు పోయే ప్రమాదముందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maharashtra, Mumbai, Train accident