బెంగుళూరు నుంచి చెన్నై వెళ్లే శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని (Bengaluru-Chennai Shatabdi Express) ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. ఇందులో పంపిణీ చేసిన ఓ న్యూస్ పేపర్ (Newspaper) చదివి ప్యాసింజర్లు నిర్ఘాంతపోయారు. వివాదాస్పద కథనాలతో (Controversial Articles) ఉన్న ఈ న్యూస్ పేపర్‌ను లైసెన్సు ఉన్న సిబ్బంది శుక్రవారం డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ అనధికారిక పబ్లికేషన్ రైట్‌వింగ్ ప్రచారంతో వివాదానికి దారితీసింది. దీంతో అప్రమత్తమైన ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) దాని ఆన్‌బోర్డ్ సేవల లైసెన్సుదారునికి హెచ్చరిక జారీ చేసింది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి దీనిపై విచారణను కూడా ప్రారంభించింది.
ఆర్యవర్త్ ఎక్స్‌ప్రెస్ అనే బెంగుళూరుకు చెందిన పబ్లికేషన్‌ను శుక్రవారం ఉదయం శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లోని ప్రయాణికులకు డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇందులో "ఇస్లామిక్ పాలనలో హిందువులు, సిక్కులు, బౌద్ధుల మారణహోమం గుర్తించాలి"... "యూఎన్ ఔరంగజేబ్‌ను హిట్లర్ లాంటి హోలోకాస్ట్ గా శాశ్వతంగా గుర్తించాలి" అనే కథనాలు మొదటి పేజీలో కనిపించాయి. అయితే పేపర్ పంపిణీ చేసేందుకు లైసెన్స్ పొందిన పీకే షెఫీ దీనిపై స్పందించారు.
అప్రూవ్డ్ న్యూస్ పేపర్ల లోపల ఈ పేపర్ ఉంచి వెండార్ పంపిణీ చేశారని షెఫీ చెప్పారు. అయితే పేపర్‌ను చదివిన ఓ ప్యాసింజర్ మాత్రం ఆర్యవర్త్ ఎక్స్‌ప్రెస్ అనేది ఏ పేపర్ లోపల ఉంచి పంపించలేదని.. దాన్ని డైరెక్ట్ గా పంపిణీ చేశారని చెప్పారు.న్యూస్ పేపర్లు పంపిణీ చేసే బోర్డులోని మా అబ్బాయిలకు వాటిలో ఈ పేపర్ ఉందని తెలియలేదని, నిజానికి వారు వార్తాపత్రికల్లోని కంటెంట్‌ను అసలు చదవరని షెఫీ చెప్పుకొచ్చారు.
This morning I boarded the Bangalore-Chennai Shatabdi Express only to be greeted by this blatantly propagandist publication on every other seat- The Aryavarth Express. Had never even heard of it. How is @IRCTCofficial allowing this??? pic.twitter.com/vJq7areg8u
— Gopika Bashi (@gopikabashi) April 22, 2022
ఎలాంటి సప్లిమెంట్లు లేదా కరపత్రాలను (Pamphlets) పంపిణీ చేయవద్దని.. ఇకపై మెయిన్ పేపర్‌ను మాత్రమే పంపిణీ చేయమని సూచించానని వివరించారు. “మేం లైసెన్సుదారున్ని హెచ్చరించాం. ఒప్పందం ప్రకారం, లైసెన్స్ పొందిన వ్యక్తి డెక్కన్ హెరాల్డ్, కన్నడ పేపర్ కాంప్లిమెంటరీ కాపీలను మాత్రమే అందించాలి. అతను కాంట్రాక్ట్ షరతులకు కట్టుబడి ఉండాలి” అని ఐఆర్‌సీటీసీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రజనీ హసిజా వెల్లడించారు.
ఇదే రైలులో శుక్రవారం ప్రయాణించిన గోపికా బక్షి అనే ఒక ప్యాసింజర్ ట్విట్టర్ వేదిక శుక్రవారం ఉదయం తనకు అందించిన న్యూస్ పేపర్‌ను రిపోర్ట్ చేశారు. “ఈ ఉదయం నేను బెంగుళూరు-చెన్నై శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కాను. అప్పుడు నాకు ఆర్యవర్త్ ఎక్స్‌ప్రెస్ అనే ప్రచార పబ్లికేషన్ ప్రతి ఇతర సీటులో కనిపించింది. దాని గురించి ఎప్పుడూ వినలేదు. @IRCTCofficial దీన్ని ఎలా అనుమతిస్తున్నారు???" అని ఆమె న్యూస్ పేపర్ ఫొటోతో పాటు ట్వీట్ చేశారు.
ఇది కూడా చదవండి : వచ్చే నెలలో భారీగా పెరగనున్న వంటనూనె ధరలు.. సామాన్యులకు బిగ్ షాక్ తప్పదా?
ఈ ట్వీట్ చాలామంది నెటిజన్లను దృష్టిని ఆకర్షించింది. రైల్వే నియంత్రణలో ఉన్న సంస్థ ద్వారానే ఈ పేపర్ అధికారికంగా పంపిణీ చేస్తున్నారా? అనే ప్రశ్నలను కొందరు నెటిజన్లు లేవనెత్తారు. ట్వీట్‌లకు ప్రతిస్పందిస్తూ దీనిపై చర్య తీసుకున్నట్లు ఐఆర్‌సీటీసీ తెలిపింది. “ ‘ఆర్యవర్త్ ఎక్స్‌ప్రెస్’ పేపర్ అప్రూవ్డ్ న్యూస్ పేపర్‌లో ఇన్‌సర్ట్ చేసి ఉంది. భవిష్యత్తులో అలాంటి ఇన్‌సర్ట్ కాపీలను రాకుండా ఉండాలని వార్తాపత్రిక విక్రేతకు సూచించాం, ఆన్‌బోర్డ్ మానిటరింగ్ సిబ్బంది ఇదే విషయంలో గట్టి నిఘా ఉంచుతారు. రైలు లైసెన్సీకి కూడా కౌన్సెలింగ్ ఇచ్చాం” అని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Indian Railways, IRCTC, News papers