Indian Railways: గరీబ్‌రథ్‌లు కొనసాగుతాయి... రైల్వే శాఖ క్లారిటీ

Garib Rath | ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 గరీబ్‌రథ్ సర్వీసులు రైల్వే ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయి. గరీబ్‌రథ్ సర్వీసులు ఏసీ-3 టైర్ టికెట్ ధరల కంటే తక్కువ రేటుకే ప్రయాణీకులు ఏసీల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి.

news18-telugu
Updated: July 20, 2019, 1:37 PM IST
Indian Railways: గరీబ్‌రథ్‌లు కొనసాగుతాయి... రైల్వే శాఖ క్లారిటీ
గరీబ్‌రథ్ (ఫైల్ ఫోటో)
news18-telugu
Updated: July 20, 2019, 1:37 PM IST
గరీబ్‌రథ్ సర్వీసులను రద్దు చేసే అవకాశం ఉందని వస్తున్న వార్తలను రైల్వేశాఖ తోసిపుచ్చింది. అలాంటి ప్రతిపాదన ఏదీ తమకు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 26 గరీబ్‌రథ్ సర్వీసులు రైల్వే ప్రయాణీకులకు సేవలందిస్తున్నాయి. గరీబ్‌రథ్ సర్వీసులు ఏసీ-3 టైర్ టికెట్ ధరల కంటే తక్కువ రేటుకే ప్రయాణీకులు ఏసీల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి. కోచ్‌ల కొరత కారణంగానే ఈ రెండు రైళ్లను తాత్కాలికంగా ఎక్స్ ప్రెస్‌ రైళ్లుగా మార్చామని రైల్వే శాఖ వివరించింది. కథ్‌గోదం- జమ్మూ తావి, కాన్పూర్-కథ్‌గోదం రైళ్లను తాత్కాలికంగా ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులుగా మార్చింది రైల్వేశాఖ.

అయితే ఈ వీటిని మళ్లీ ఆగస్టు 4 నుంచి గరీబ్‌రథ్‌లుగా పునరుద్ధరించనున్నారు. 2006లో అప్పటి రైల్వేశాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ పేద, మధ్యతరగతి ప్రయాణీకులకు ఏసీ రైలు ప్రయాణం కల్పించేందుకు గరీబ్‌రథ్‌ను ప్రారంభించారు. తొలి గరీబ్‌రథ్‌ను బీహార్‌లోని సహస్ర నుంచి పంజాబ్‌లోని అమృత్ సర్ వరకు నడిచింది.






First published: July 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...