రైలు ప్రయాణంలో యువతికి వేధింపులు.. కాపాడిన రైల్వే మంత్రి

ఒక దేశానికి రైల్వే మంత్రి అంటే.. ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో తెలియంది కాదు. ఉన్నతాధికారులతో మీటింగులు, సమీక్షలు.. ఇలా బోలెడన్ని పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆపదలో ఉన్నామంటూ ఓ సాధారణ మనిషి ఫోన్ చేసి అడిగితే స్పందించే తీరిక ఉండదు. కానీ, సినిమాల్లో మాత్రం అలాంటివి ఈజీగా సాధ్యమవుతాయి. హీరో సీఎం అయినా, మంత్రయినా... అమాంతం వెళ్లిపోయి ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంటాడు. రీల్ లైఫ్‌లో ఓకే.. మరి రియల్ లైఫ్‌లో అది సాధ్యమా?

news18-telugu
Updated: March 14, 2019, 12:53 PM IST
రైలు ప్రయాణంలో యువతికి వేధింపులు.. కాపాడిన రైల్వే మంత్రి
Indian Railways: రైలు బోగీ డర్టీగా ఉందా? క్షణాల్లో ఫిర్యాదు చేయొచ్చు ఇలా...
  • Share this:
ఒక దేశానికి రైల్వే మంత్రి అంటే.. ఎంత బిజీ షెడ్యూల్ ఉంటుందో తెలియంది కాదు. ఉన్నతాధికారులతో మీటింగులు, సమీక్షలు.. ఇలా బోలెడన్ని పనుల్లో నిమగ్నమై ఉంటారు. ఆపదలో ఉన్నామంటూ ఓ సాధారణ మనిషి ఫోన్ చేసి అడిగితే, సందేశం పంపితే స్పందించే తీరిక ఉండదు. కానీ, సినిమాల్లో మాత్రం అలాంటివి ఈజీగా సాధ్యమవుతాయి. హీరో సీఎం అయినా, మంత్రయినా... అమాంతం వెళ్లిపోయి ఆపదలో ఉన్నవారిని కాపాడుతుంటాడు. రీల్ లైఫ్‌లో ఓకే.. మరి రియల్ లైఫ్‌లో అది సాధ్యమా? అంటే సాధ్యమేనని నిరూపించారు రైల్వేమంత్రి పియూష్ గోయల్. అందుకు ప్రత్యక్ష ఉదారణే భూపాల్‌లో జరిగిన ఈ ఘటన. విశాఖ నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న 22415నెంబర్ ట్రైన్‌లో యువతి ప్రయాణిస్తోంది. భూపాల్ నుంచి న్యూ ఢిల్లీ వెళ్తున్న ఆ యువతి.. అనుకోని ఆపదలో చిక్కుకుంది. బాగా తాగి కోచ్‌లోకి వచ్చిన కొందరు యువకులు.. ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలెట్టారు. దీంతో ఆమె విషయాన్ని ఫోన్ మెసేజ్ ద్వారా తన సోదరుడికి తెలియజేసింది. అయితే, రాంచీలో ఉన్న అతను.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా రేైల్వే మంత్రి పియూష్ గోయల్ దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే మంత్రి అధికారిక ట్విట్టర్‌ను అనుసంధానిస్తూ ‘‘ సార్, నా సోదరి ట్రైన్ నంబర్ 22415లో ప్రయాణిస్తోంది. ఆమె బెర్త్ దగ్గరకు కొందరు యువకులు మద్యం మత్తులో వచ్చి అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. నేనిప్పుడు రాంచీలో ఉన్న కారణంగా.. సాయం చేయలేని స్థితిలో ఉన్నాను. మీ సాయం కోసం అభ్యర్థిస్తున్నాం.’’ అని వేడుకున్నాడు.

ట్విట్టర్‌లో ఆ పోస్టును చూసిన రైల్వే మంత్రి వెంటనే స్పందించారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. జీఆర్‌పీ పోలీసులను ఆమె ప్రయాణిస్తున్న ట్రైన్‌లోకి పంపించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈవ్ టీజర్లను అరెస్ట్ చేశారు. యువతి క్షేమ సమాచారాన్ని ఆమె సోదరుడికి తెలియజేశారు.

యువతి సోదరుడు చేసిన ట్విట్టర్‌కు స్పందించిన రైల్వేమంత్రి రిట్వీట్ చేశారు. ‘‘ మీరు చేసిన సూచనకు, ఇచ్చిన సమాచారానికి ధన్యవాదాలు. నిశ్చింతంగా ఉండండి.. మీ సోదరిని రక్షించేందుకు ఇప్పటికే జీఆర్‌పీ పోలీసులను రంగంలోకి దింపాం’’ అని భరోసా ఇచ్చారు.
రైల్వే మంత్రి ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు యువతి ప్రయాణిస్తున్న ట్రైన్‌లోకి ప్రవేశించి.. పోకిరీల ఆటకట్టించారు. ఆమెను క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు.

 

First published: March 14, 2019, 12:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading